పన్నాలాల్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

740 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
== రచనల జాబితా ==
== శైలి ==
పన్నాలాల్ పటేల్ రచనల్లో గ్రామజీవనంలోని ఆచార వ్యవహారాలు, పంటలు క్షామాలు, నీతి అవినీతులు వంటివాటిని ప్రతిబింబించారు. ప్రముఖ గుజరాతీ సాహిత్యవిమర్శకులు దర్శక్ పన్నాలాల్ రచనల గురించి మాట్లాడుతూ పాత్రల వ్యక్తిగత కష్టాలనే కాక వాటి నుంచి కాలచక్రంలోని మార్పులను, వాటికి ఆధారకేంద్రాలైన స్థానాలను నవలల ద్వారా చూపగలిగారని పేర్కొన్నారు. వ్యక్తిగత కార్యకలాపాల వల్ల లభించే సుఖదుఃఖాల కన్నా సాంఘిక కార్యకలాపాల వల్ల లభించే కష్టసుఖాల పరిమాణం పెరుగుతుందని, ఈ అంశాన్ని పన్నాలాల్ పటేల్ నవలల్లో చిత్రీకరించారని వారు వివరించారు. అశాంతి, దోపిడీ, దైవ అననుకూలత వల్ల వచ్చే ఆపదలు, షావుకార్ల ఒత్తిడి, రాచరికం, ధనమదం వీటన్నిటి పదఘట్టనల కింద నలుగుతూ, ఎప్పుడూ వాటి వల్ల బాధపడుతూ కూడా బతుకుపై మమకారంతో ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవితం గడిపే పల్లెటూరి కష్టజీవుల కథలను ఇతివృత్తంగా స్వీకరించారని విమర్శకులు పేర్కొన్నారు.
 
== మూలాలు ==
39,742

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1023026" నుండి వెలికితీశారు