నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
== ప్రచురణ ==
కొత్తగా అక్షరాస్యులైన వయోజనులు, పిల్లలతో సహా సమాజంలో అన్ని వర్గాల వారికి వినోదం, విజ్ఞానం, వికాసం కలిగించే గ్రంథాలను ప్రచురించడం నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురణల విభాగం లక్ష్యం. కథాసాహిత్యం, ఇతర సాహిత్యాలను తెలుగు, ఇంగ్లీషు, హిందీలతోపాటు 16 భాషలలో గ్రంథాలను ప్రచురిస్తున్నారు. రాజ్యాంగంలోని ఎనిమిదో అనుబంధంలో చేర్చిన భాషలన్నిటిలో పుస్తక ప్రచురణలు చేపట్టారు. ఇవేకాక ఆవో, గారో, ఖాసీ, మిసింగ్, మిజో మొదలైన ఆదివాసీ భాషలలో కూడా ప్రయోగాత్మకంగా ప్రచురణలు చేపట్టారు.<br />
ప్రాధాన్యత కలిగివున్నా, భారతసాహిత్యంలో నిర్లక్ష్యానికి గురైన పాపులర్ సైన్స్ పుస్తకాలు, సాంకేతిక పరిభాష లేని సమాచార గ్రంథాలు, పర్యావరణ విజ్ఞాన గ్రంథాలు, దేశంలోని వివిధ విషయాలకు చెందిన పుస్తకాల ప్రచురణకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
 
== మూలాలు ==