రాయచోటి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
*గ్రామదేవత యల్లమ్మ పూజ అనంతరం వీరభద్రుడికి పూజలు చేస్తారు.
*ఏటా మార్చి 27న, సెప్టెంబరు 14న ఉదయం ఆరు గంటలకు స్వామివారి గర్భగుడిలో సూర్యకిరణాలు విగ్రహం పాదల వద్ద పడతాయి.
====మహా నైవేద్యం====
ఆలయంలో ఏటా మహా నైవేద్య ప్రదానం ఘనంగా జరుగుతుంది. ఆరోజు ఆలయంలో వీరభద్రుడిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. [[వీరశైవులు]] ఉపవాసంతో తయారుచేసిన నైవేద్యాన్ని స్వామి ఎదుట ఉంచుతారు. కత్తులతో విన్యాసాలు చేసి ఖడ్గ మంత్రాలు చదువుతారు. స్వామి తలుపులు తెరచి ప్రత్యేక పూజలు చేస్తారు. వడియరాజులు మొదట ప్రసాదాన్ని కొల్లగొట్టుకు పోయిన అనంతరం మిగిలిన ప్రసాదాన్ని ఇతరులు తీసుకెళ్లడం ఆనవాయితీ. కర్ణాటక భక్తులు స్వామి వారికి వస్త్రాలను బహూకరిస్తారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. నందీశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. భక్తులు మహానైవేద్యాన్ని పవిత్రంగా భావిస్తారు. కర్ణాటక భక్తులు ప్రసాదాన్ని ఎండబెట్టుకుని చాలాకాలం వాడుకుంటారు. 360 శేర్ల బియ్యం, వంద కిలోల క్యారెట్, రెండు వందల కిలోల వంకాయలు, రెండు వందల కిలోల గనుసు గడ్డలు, వంద కిలోల ఉల్ల గడ్డలు, నాలుగు బండ్ల గుమ్మడికాయలు తరిగి వండుతారు. 10శేర్ల బియ్యంతో అత్తిరాసాలు([[నిప్పట్లు]]) నెయ్యితో తయారు చేసి, అన్నంపై వీటిని పేర్చుతారు. భద్రకాళి వీరభద్రుడికి నైవేద్యంగా పెడతారు. ఏదైనా దోషాలు పోవడానికి దీనిని ఏర్పాటు చేస్తారు. నైవేద్య దినాన్ని కన్నగుడిలు పవిత్రంగా భావిస్తారు. పెద్ద సంఖ్యలో హాజరవుతారు
 
==శాసనసభ నియోజకవర్గం==
"https://te.wikipedia.org/wiki/రాయచోటి" నుండి వెలికితీశారు