విద్యాపతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
విద్యాపతి పూర్వీకులు మరొకపక్క మైథిలి ప్రాంతంలో సుప్రసిద్ధి పొందిన పలు స్మృతి గ్రంథాలను, ధర్మసూత్ర గ్రంథాలను రచించారు. ఆయన పూర్వీకులు వీరేశ్వరుడు సామవేదాధ్యాయులైన ఛాంద్యోగులు నిర్వర్తించాల్సిన కర్మకాండని వివరించే "పద్ధతి" గ్రంథాన్ని, రామదత్తుడు శుక్లయజుశ్శాఖీయులైన వాజసనేయులు నిర్వర్తించే కర్మకాండ వివరణలతో మరొక "పద్ధతి" గ్రంథాన్ని రచించారు. మైథిలి ప్రాంతీయులైన ఛాంద్యోగ, వాజసనేయ శాఖీయుల కర్మకాండల్లో ఈ గ్రంథాలు నేటికీ అమల్లో ఉన్నాయి. గణేశ్వర ఠాకూరు ''సుగతి సోపానం'' మొదలుగా గల ఎన్నో స్మృతి గ్రంథాలను రచించారు.
 
ఆయన పూర్వీకులందరిలోకీ రాజనీతిరంగంలోనూ, ధర్మశాస్త్ర రచనలోనూ మేధస్సులో సుప్రసిద్ధుడు చండీశ్వరుడు(విద్యాపతి ముందుతరం వాడు).
"https://te.wikipedia.org/wiki/విద్యాపతి" నుండి వెలికితీశారు