సుందర కాండ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 25:
అయితే ఆ షోడశి రచనలోనే గుంటూరు శేషేంద్రశర్మ, పై వాదనలతో ఏకీభవించలేదు. "శ్రీ సుందరకాండకు ఆ పేరెట్లు వచ్చినది?" అనే అధ్యాయంలో రచయిత చెప్పిన కారణం - సుందరకాండ వాల్మీకి రామాయణానికి హృదయం. మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క [[కుండలిని|కుండలినీ యోగసాధన]], త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి. ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధము నందు వసించును. కనుక ఇది సుందరకాండము. [[ఆది శంకరుడు|ఆది శంకరుని]] ప్రసిద్ధ మంత్రయుక్త స్తోత్రము [[సౌందర్య లహరి]]లోని "సౌందర్య" పదము ఈ భావములోనే వాడబడినది. [[బ్రహ్మాండ పురాణము]]లో ఈ కాండము "సౌందర్య కాండము" అనియే చెప్పబడినది.<ref name="shodasi"/>
 
==సుందరకాండ సంక్షిప్త కధకథ==
[[కిష్కింధ కాండ]] చివరిలో సీతాన్వేషణానికై దక్షిణదిశకు బయలుదేరిన బృందం ఎలాగో సాగర తీరానికి చేరుకొంటారు. నూరు యోజనాల అవతల రావణుని నగరం [[లంక]]లో సీత ఉండవచ్చునని [[సంపాతి]] ద్వారా తెలుసుకొంటారు. కాని సాగర తరణం సాధ్యమయ్యేది ఎలాగని హతాశులౌతారు. [[జాంబవంతుడు|జాంబవంతుని]] ప్రేరణతో సాగరాన్ని తాను గోష్పాదం లాగా లంఘించగలనని హనుమంతుడు సన్నద్ధుడౌతాడు. అక్కడినుండి సుందరకాండ కథ మొదలౌతుంది.
 
"https://te.wikipedia.org/wiki/సుందర_కాండ" నుండి వెలికితీశారు