చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
* ఒక్క చాక్‌లెట్ తింటే 150 అడుగుల దూరం నడించేంత శక్తి వస్తుందట.
* ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన చాక్‌లెట్లు ఖర్చయిపోతున్నాయి.
*కకోవా చెట్ల స్వస్థలం దక్షిణ అమెరికా. దీన్ని కకావో అని పిలిచేవారు. వీటిని మొదట ఆల్మెక్ అమెరికన్లు గుర్తించారు. మాయన్లూ అజ్‌టెక్‌ల ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వీళ్లు కకోవా గింజల్నే కరెన్సీగా వాడేవారు.
*అరకిలో చాక్లెట్ తయారీకి సుమారు 400 కకోవా గింజలు కావాలి. ఏటా ఆరు లక్షల టన్నుల గింజల్ని చాక్లెట్లకోసం వాడుతున్నారు.
*శక్తి కోసం నెపోలియన్ వెంట ఎప్పుడూ ఓ చాక్లెట్ ఉండేదట. జ్ఞాపకశక్తి పెరిగేందుకు రోజూ చాక్లెట్ పూత పూసిన 3 వెల్లుల్లి రెబ్బల్ని ఉదయాన్నే తినేవాడట రూజ్‌వెల్ట్.
*లండన్‌లోని ఆర్చిపెలాగో రెస్టారెంట్ మెనూలో చాక్లెట్ పూతపూసిన తేళ్లు ఉంటాయి.
*ఆనందాన్ని పంచేందుకో పెంచుకునేందుకో చాక్లెట్ తినే సందర్భాల నుంచి అన్నింటా చాక్లెట్ అనే సంస్కృతి భారతీయులకీ అలవాటైపోయింది. హాట్ చాక్లెట్ ఫౌంటెయిన్లతోపాటు చాక్‌టెయిల్సూ, చాక్‌షేకులూ, చాకొపిజ్జాలూ, శాండ్‌విచ్‌లతో కూడిన చాక్లెట్‌రూమ్‌లు భారత నగరాల్లోనూ ఉన్నాయి. ఔత్సాహిక వంటగాళ్ళు అయితే చాక్లెట్ కేకులూ కుకీలూ డెజర్ట్‌లూ బిస్కెట్లూ డ్రింకులూ ఐస్‌క్రీములూ, పాప్‌కార్న్‌లతో పాటు లడ్డూలూ ఇడ్లీలూ దోసెలూ సమోసాలక్కూడా చాక్లెట్ రుచులు అద్దేస్తున్నారు.
*లిథేనియాలోని విల్నియిస్‌లో ఆక్రోపాలిస్ షాపింగ్‌మాల్‌లో వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ చాక్లెట్ రూమ్‌ని ఏర్పాటు చేసింది. పైకప్పు నుంచి ఫ్లోరింగ్ వరకూ అందులో అన్నీ చాక్లెట్ నిర్మితాలే. ఇది కేవలం చూసేందుకే. గొడివా కంపెనీ కూడా చాక్లెట్ రూమ్‌ని ఏర్పాటు చేసింది. సోఫాలో కూర్చుని మరీ ఆ గదిలోని చాక్లెట్ అందాలను ఆస్వాదించవచ్చు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు