సప్తచక్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 44 interwiki links, now provided by Wikidata on d:q180720 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[శ్రీ విద్య]]లోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవునియందు ఏడు చక్రములుండును.
[[దస్త్రం:Yogin_with_six_chakras,_India,_Punjab_Hills,_Kangra,_late_18th_century.jpg|right|thumb|షట్చక్రాలను సూచించే పటం - 18వ శతాబ్దానికి చెందిన చిత్రం - [[కాంగ్రా శైలి]] ]]
]
 
* [[మూలాధార చక్రము]]: గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే [[కుండలినీ శక్తి]] యుండును. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.
 
 
* [[స్వాధిష్ఠాన చక్రము]]: లింగమూలమున గలదు. ఆరు దళములతో సింధూరవర్ణము గల జలతత్వ కమలము గలది.
 
 
* [[మణిపూరక చక్రము]]: నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము.
 
 
* [[అనాహత చక్రము]]: హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి హేమవర్ణము గల వాయుతత్వ కమలము.
 
 
* [[విశుద్ధి చక్రము]]: కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము.
 
 
* [[ఆజ్ఞా చక్రము]]: భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము.
 
 
* [[సహస్రార చక్రము]]: బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈస్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.
 
 
== ఇవి కూడా చూడండి ==
Line 29 ⟶ 15:
* [[శ్రీవిద్య]]
* [[శ్రీచక్రము]]
 
 
 
=== ఆధారములు ===
 
"https://te.wikipedia.org/wiki/సప్తచక్రాలు" నుండి వెలికితీశారు