చిల్లర దేవుళ్ళు (నవల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
== ఇతివృత్తం ==
చిల్లర దేవుళ్లు కథాకాలం 1936-42 ప్రాంతంలోనిది. కథాస్థలం తెలంగాణాలోని ఓ చిన్న పల్లెటూరు. నవల ప్రారంభంలో సారంగపాణి అనే సంగీత ఉపాధ్యాయుడు బతుకుతెరువు కోసం విజయవాడ నుంచి ఆ ఊరికి వస్తాడు. ఊరి నడుమ దేశ్‌ముఖ్ రామారెడ్డి [[గడీ]] ఉంటుంది. అది ఊరి మొత్తానికీ ఏకైక భవంతి కాగా కరణం వెంకట్రావుతో పాటుగా మరికొందరికి మాదిరి ఇళ్ళు ఉంటాయి. మిగతా ఊరందరివీ గుడిసెలు. నిజాం పాలనలో లభించిన విపరీతమైన అధికారాలతో దొర, కరణం ఊరిని పరిపాలిస్తూ ఉంటారు. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న దొర పాణికి తన గడీలో ఆశ్రయమిస్తాడు. రోజూ పాణి పాట వింటూ, అతనికి ఊళ్ళో కరణం కూతురు తాయారుతో పాటుగా రెండు మూడు సంగీత పాఠాలు ఏర్పాటుచేస్తాడు.

పాణికి పోనుపోనూ ఊళ్ళో దొరది ఎదురులేని శాసనమని తెలుస్తుంది. చిన్న చిన్న తప్పులు చేసినా, తన అధికారాన్ని ఏమాత్రం తక్కువచేసినా దొర ఎలాంటి కఠినశిక్షలు విధిస్తాడో తెలుస్తూంటుంది. దొరకీ కరణానికి వైరం ఉన్నా జనాన్ని అణచివేయాల్సి వస్తే మాత్రం ఏకమైపోవడం కూడా చూస్తాడు. గడీలో ఆడబాపగా పనిచేస్తున్న వనజది వేశ్య కన్నా దారుణమైన జీవితం.
<!-- ఊరిమీద దొర పెత్తనం ఎలాంటిదో నెమ్మది నెమ్మదిగా అర్ధమవుతుంది పాణికి. కథలో అతడిది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే. ఊళ్ళో దొర మాట శిలాశాసనం. అతని కంట పడ్డ ఏ స్త్రీ తప్పించుకోలేదు. అంతే కాదు చిన్న తప్పుకు సైతం దొర విధించే శిక్ష అత్యంత కఠినంగా ఉంటుంది. తన అధికారాన్ని నిలబెట్టుకోడానికి దొర ఎంతకైనా వెనుకాడడని తెలుస్తుంది పాణికి. దొరకీ-కరణానికీ మధ్య వైరం, జనం విషయానికి వచ్చేసరికి ఇద్దరూ ఏకం కావడం చూస్తాడతడు.