అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
అగ్రహారములకు మంగలమనియు, చతుర్వేది మంగలమినియు పేరుండెడిది. [[వీరచోడుడు]] చతుర్వేది మంగలమున ఒకచోట గల శాసనమునుండి, ఇచ్చట [[వ్యాకరణ]], [[మీమాంస]], [[వేదాంత]], [[ఋగ్యజుస్సామ]],[[రూపావతార]], [[పురాణ]], [[జ్యోతిష్య]], [[వైద్య]] విద్యలను బోధించు ఆచార్యులొక్కక్కరికి ఒక్కొక్క వృత్తి కల్పింపబడెడిదని తెలియజేయడమైనది. ఈ అగ్రహారములకు ఎ విధమైన బాధ కలుగకుండగ చేసి రాజులు వానికి సర్వస్వతంత్రములను కల్పించెడివారు. వీనిపై ఏవిధమైన పన్నులను విధింపబడకుండినవి. ఇందలి భూమిపై వచ్చు ధాన్యమంతయూ అగ్రహారీకులదే. రాజకీయోద్యోగులకు ఇందు ప్రవేశము లేకుండెడిది. అందలి పండితులను అన్యాపేక్షలేక సర్వకార్యములను నిర్వహించుకొనుచుండిరి. ఇటులన్నివిధములను నేటి విశ్వవిద్యాలయములను మించిన స్వాతంత్ర్యము కలిగి ఈ అగ్రహారములు అనన్య దృష్టితో వైదిక విద్యను వ్యాపింపజేయుచుండిరి.
== మూలాలు ==
 
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:సంస్కృత పదజాలము]]
"https://te.wikipedia.org/wiki/అగ్రహారం" నుండి వెలికితీశారు