అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
అగ్రహారములకు మంగలమనియు, చతుర్వేది మంగలమినియు పేరుండెడిది. [[వీరచోడుడు]] చతుర్వేది మంగలమున ఒకచోట గల శాసనమునుండి, ఇచ్చట [[వ్యాకరణ]], [[మీమాంస]], [[వేదాంత]], [[ఋగ్యజుస్సామ]],[[రూపావతార]], [[పురాణ]], [[జ్యోతిష్య]], [[వైద్య]] విద్యలను బోధించు ఆచార్యులొక్కక్కరికి ఒక్కొక్క వృత్తి కల్పింపబడెడిదని తెలియజేయడమైనది. ఈ అగ్రహారములకు ఎ విధమైన బాధ కలుగకుండగ చేసి రాజులు వానికి సర్వస్వతంత్రములను కల్పించెడివారు. వీనిపై ఏవిధమైన పన్నులను విధింపబడకుండినవి. ఇందలి భూమిపై వచ్చు ధాన్యమంతయూ అగ్రహారీకులదే. రాజకీయోద్యోగులకు ఇందు ప్రవేశము లేకుండెడిది. అందలి పండితులను అన్యాపేక్షలేక సర్వకార్యములను నిర్వహించుకొనుచుండిరి. ఇటులన్నివిధములను నేటి విశ్వవిద్యాలయములను మించిన స్వాతంత్ర్యము కలిగి ఈ అగ్రహారములు అనన్య దృష్టితో వైదిక విద్యను వ్యాపింపజేయుచుండిరి.
== గ్రామనామంగా ==
అగ్రహారం అనే పదం చాలా గ్రామనామాలకు ఉత్తరపదంగా ఉంటుంది. బ్రాహ్మణులకు వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, వారి విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు. అలాంటి గ్రామాలను అగ్రహారమని పిలుస్తారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అగ్రహారం" నుండి వెలికితీశారు