రామానుజాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
రామానుజాచార్యులు వ్యాస విషయాన్ని విలీనం చేసితిని
పంక్తి 1:
{{విలీనం|రామానుజాచార్యులు}}
'''రామానుజాచార్య''' లేదా '''రామానుజాచార్యుడు''' (క్రీ.శ. [[1017]] - [[1137]] ) [[విశిష్టాద్వైతం|విశిష్టాద్వైతము]] ను ప్రతిపాదించిన గొప్ప [[తత్వవేత్త]], [[ఆస్తిక హేతువాది]], [[యోగి]]. రామానుజాచార్యుడు [[త్రిమతాచార్యులు|త్రిమతాచార్యుల]] లో ఒకడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, [[దేవుడు|దేవుని]] పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు:
* మొదటిది, ప్రబలంగా కొనసాగుతున్న, [[బౌధ్ధ మతం|బౌధ్ధ]], [[జైన మతము|జైన]], శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.
Line 86 ⟶ 85:
[[వర్గం:1017 జననాలు]]
[[వర్గం:1137 మరణాలు]]
-----------------------------------------------------------------------
{{విలీనం|==రామానుజాచార్యులు}} వ్యాస విషయం==
 
* [[రామానుజాచార్యుడు]], విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, త్రిమతాచార్యులలొ ద్వితీయుడు.
విశిష్టాద్వైత మతోద్ధారకుఁడు. ఈయన 800 సంవత్సరములకు ముందు అవతరించినట్టు తెలియవచ్చెడి. ఈయన తండ్రి [[ఆసూరి కేశవాచార్యులు]]. తల్లి [[కాంతిమతి]]. జన్మస్థానము చెన్నపురికి సమీపమున 26 మయిళ్ల దూరమున ఉండు [[శ్రీ పెరుంబూదూరు]] (భూతపురము). విద్యాభ్యాసము చేసినచోటు [[కాంచీపురము]]. సకల శాస్త్రములను యాదవ ప్రకాశులు అను అద్వైత మతావలంబి అగు సన్యాసివద్ద చదివి, వానికెల్ల విశిష్టాద్వైత పరముగా అర్థము సాధించి ఆమతమును స్థాపించి పిమ్మట త్రిదండసన్యాసి అయి యతిరాజు అనుపేరు పొంది, మేలుకోట (తిరునారాయణపురము)[[శ్రీరంగము]] [[తిరుపతి]] మొదలగు అనేక దివ్యస్థలములయందు మఠములను ఏర్పఱచి అచ్చటచ్చట వైష్ణవ మతమును స్థాపించెను. వెండియు ఈయన బహుదేశాటనము చేసి పలుమతముల వారిని జయించి శిష్య సంఘమును సంపాదించి తమ మతమును వృద్ధిపొందించెను. ఈయన వ్యాససూత్ర భాష్యము,[[ గీతాభాష్యము]], [[తర్కభాష్యము]], వేదార్థసంగ్రహము, న్యాయామృతము, వేదాంత ప్రదీపము, వేదాంత తత్త్వసారము, నారదీయ పాంచరాత్రాగమము, [[రంగనాథస్తవము]], గద్యత్రయము, మఱియు పెక్కు స్వరూప గ్రంథములను రచియించెను. కనుక ఈయనకు భాష్యకార్లు అనియు ఎంబెరు మానారు అనియు నామధేయములు కలిగెను. ఈ రామానుజాచార్యులు శేషాంశసంభూతుఁడు.
 
ఈయనకుముందు [[విశిష్టా ద్యైవతము]]ను ప్రతిపాదించినవారు కొందఱు కలరు. వారిలో ముఖ్యులు పన్నిద్దఱు.
 
1. [[సరోయోగి]]. (పొయ్‌హై యాళ్వారు) ఈయన కంచియందలి పొయ్‌హై అను పుష్కరిణియందు ఒక బంగారు తామరపువ్వులో ద్వాపరయుగాంతమునందు పాంచజన్యాంశమున అయోనిజుఁడై జనించెను.
 
2. [[భూతయోగి]]. (పూదత్తాళ్వారు) ఈయన సరోయోగి అవతరించిన మఱునాడు మల్లాపురి (తిరుక్కడల్‌మల్లై) అను గ్రామమునందు ఒక సరస్సునందలి నల్ల కలువపూవునందు గణాంశమున అయోనిజుఁడు అయి అవతరించెను.
 
3. [[మహాయోగి]] (పేయాళ్వారు) ఈయన భూతయోగి అవతరించిన మఱునాడు మాయారము (మామైలైనగరు) అను ఊరి యందు ఒక సరస్సునంది యెఱ్ఱకలువ పూవునందు నందకాంశమున అయోనిజుఁడు అయి అవతరించెను.
 
4. భక్తిసారుఁడు. (తిరుమాళికై యాళ్వారు) ఈయన మీఁదచెప్పిన మూవురును అవతరించిన మూడునెలలకు మహీసారక్షేత్రము (తుముపి) అనుచోట తపస్సు చేయుచున్న భృగు మహర్షికి ఇంద్రునిచే ప్రేరేపింపఁబడి ఆఋషిని మోహింపఁజేసిన అప్సరస వలన చక్రాంశ సంభూతుఁడు అయి జనించెను. భగవద్భక్తుఁడును బిడ్డలు లేనివాఁడును అగు ఒక మేదరవాఁడు వెదుళ్లకై అచ్చటికి వచ్చి ఆశిశువును తన యింటికి ఎత్తుకొనిపోయి పెంచెను.
 
5. శఠారి. (నమ్మాళ్‌వారు) ఈయన *** కురుకాపరి. (తిరుక్కు*** గ్రామమునందు కారి అను పేరుగల సచ్ఛూద్రునికి ఉడయనంగై అను భార్యయందు విష్వక్సేనాంశమున జనించెను. అట్లు అవతరించి ఎల్ల శిశువులవలె స్తన్యపానము చేయక అభివృద్ధి పొందెను.
 
6. పరాంకుశదాసుఁడు. (మధురకవి ఆళ్వారు) ఈయన ద్వాపరయుగాంతమున పాండ్యదేశమునందలి తిరుక్కోళూరు అను గ్రామమునందు ఒక పురశ్చూడుఁడు (ముందరి జుట్టువాఁడు) అగు బ్రాహ్మణునికి కుముదాంశమున జనించి సామవేదాధ్యాపకుఁడు అయి దివ్యదేశ యాత్రచేయుచు అయోధ్యకు పోయి ఉండెను. అప్పుడు ఇచ్చట దక్షిణ దేశమునందు నమ్మాళ్వారు అవతరించి ఆతేజస్సు తనకు కనఁబడఁగా అందుండి వచ్చి నమ్మాళ్వారువల్ల తత్వవిషయమును గ్రహించెను.
 
7. కులశేఖరాళ్వారు. ఈయన కలియుగాదియందు దృఢవ్రతుఁడు అను రాజునకు పుత్రుఁడు అయి కౌస్తుభాంశమున అవతరించి ధనుర్వేదాదివిద్యలు నేర్చి పరమజ్ఞానసంపన్నుఁడై భగవత్కటాక్షమును పొందెను.
 
8. విష్ణుచిత్తుఁడు. (పెరియాళ్వారు) ఈయన కలియుగాదియందు శ్రీవిల్లిపుత్తూరు అను గ్రామమునందు ఒక పురశ్చూడుఁడు అగు వైష్ణవునకు గరుడాంశమున పుత్రుఁడై అవతరించి వేదవేదాంగములెల్ల అభ్యసించి అచ్చటి వటపత్రశాయి అను విష్ణుమూర్తికి తులసి కైంకర్యము చేయుచు ఉండి పాండ్యదేశపు రాజునొద్ద పరతత్వ నిర్ణయము చేసి బహుమతి పడసి పిదప లక్ష్మీపతి అగు శ్రీమన్నారాయుణుని ప్రత్యక్షము చేసికొని తులసివనమునందు అయోనిజయై జనించి తన కొమార్తె అయిన ఆముక్తమాల్యదను (చూడికొడుత్త నాంచారును) ఆ దేవునికి భార్యగా సమర్పించి కృతార్థుఁడు అయ్యెను.
 
9. గోద. (చూడికొడుత్తాళ్‌) ఈమె కలియుగాదిని శ్రీవిల్లిపుత్తూరి యందు విష్ణుచిత్తునియొక్క తులసివనమునందు అయోనిజయై భూమ్యంశమున జనించి ఆపెరియాళ్వారుచే పెంపఁబడి ఆయన పెరుమాళ్లకు కట్టికొని పోయెడు తులసిమాలలు తాను ముందు ధరించి పిమ్మట పూలబుట్టలో పెట్టుచువచ్చి కడపట ఆపెరుమాళ్లకు భార్య అయ్యెను. కనుక ఈమె ఆఁడుది అయినను తక్కిన ఆళ్వారులలో చేర్చి ఎన్నఁబడెను.
10. భక్తాంఘ్రిరేణువు. (తొండరడిప్పొడి యాళ్వారు) ఈయన కలియుగము పుట్టిన ఇన్నూఱేండ్లకు పిమ్మట చోళదేశమునందు మండంగుడి అను గ్రామము నందు ఒక పురశ్చూడ వైష్ణవునకు పుత్రుఁడై వనమాలాంశమున జనియించి విప్రనారాయణుఁడు అనుపేరు వహించి భగవత్కైంకర్యపరుఁడై కాలము గడపెను.
 
11. మునివాహనుఁడు. (తిరుప్పాణాళ్వారు) ఈయన కలియుగము పుట్టిన మున్నూఱు ఏండ్లకు పిమ్మట చోళదేశము నందలి నిచుళాపురము (ఉరయూరు) అను గ్రామమునందువిడవలిగంటలలో అయోనిజుఁడు అయి శ్రీవత్సాంశమునందు జనియించి బిడ్డలులేనివారైన చండాల దంపతులచే పెంపఁబడి వీణాగానమునందు నిపుణుఁడై భగవన్నామస్మరణచేసి కృతార్థుఁడు అయ్యెను.
12. పరకాలుఁడు. (తిరుమంగై యాళ్వారు) ఈయన కలియుగము పుట్టిన నన్నూఱు సంవత్సరములకాలమున తిరువాలిత్తిరునగరు అను గ్రామమునందు నీలుఁడు అను ఒక శూద్రునికి పుత్రుఁడు అయి అవతరించి ధనుర్విద్య మొదలు అగు విద్యలనేర్చి చోళరాజునొద్ద కొంచెపాటి అధికారము ఒకటి సంపాదించుకొని తనకు తగిన నలుగురు మంత్రులను చేర్చుకొని మెలఁగుచు అయోనిజయై జనించిన కుముదవల్లి అను కన్యకను వివాహము అగుటకొఱకు దొంగిలించియు మోసపుచ్చియు ధనమును ఆర్జించి శ్రీరంగపు రంగనాథుని దేవాలయగోపుర ప్రాకారాదులను కట్టించి ఆమెను పెండ్లాడి పరమ భాగవత భక్తుఁడు అయి ముక్తుఁడు అయ్యెను. ఈచెప్పఁబడిన వారే పన్నిద్ద ఱాళ్వార్లు అనఁబడుదురు.
'''రామానుజాచార్యులు''' కొందరి [[పేరు]].
* [[కిడాంబి రామానుజాచార్యులు]], సంస్కృతాంధ్ర పండితులు.
* [[బుక్కపట్టణం రామానుజాచార్యులు]], సుప్రసిద్ధ పత్రికా రచయిత.
* [[సముద్రాల రామానుజాచార్యులు]], సుప్రసిద్ధ సినిమా రచయిత.
 
{{అయోమయ నివృత్తి}}
 
[[వర్గం:హిందూ గురువులు]]
[[వర్గం:హిందూమత మూసలు]]
-------------------------------------------------------------
"https://te.wikipedia.org/wiki/రామానుజాచార్యుడు" నుండి వెలికితీశారు