కాంచెన్‌జంగా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
| easiest_route = glacier/snow/ice climb
}}
'''కాంచెన్‌జంగా ''' [[హిమాలయ]] పర్వతము లలోని ఒక పర్వతము. ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం... అయిదు నిధులను కలిగున్న చోటు... మానవుడు అడుగు మోపని శిఖరం... స్థానికులు దేవతగా భావించే స్థలం.
==నేపధ్యము==
భూమ్మీద ఎత్తయిన పర్వతం ఏదీ అంటే 'ఎవరెస్టు' అని చెబుతారు. కానీ 1852 వరకు ప్రపంచంలోనే అతి ఎత్తయిన పర్వతం మన దేశంలో ఉన్న కాంచెన్‌జంగానే అనుకునేవారు. తర్వాత 'ట్రిగ్నామెట్రిక్ సర్వే ఆఫ్ ఇండియా' వాళ్లు పర్వతాలను కొలిచాక 1856లో ఎవరెస్టు, కే2 పర్వతాల తర్వాత 8,586 మీటర్ల (28,169 అడుగులు) ఎత్తున్న కాంచెన్‌జంగాను భూమ్మీద మూడో ఎత్తయిన, మనదేశంలోనే ఎత్తయిన పర్వతంగా ప్రకటించారు.
==అధిరోహణం==
ఎవరెస్టు శిఖరం పై వరకు ఇప్పటికి వేలాది మంది వెళ్లారు. అలాగే కాంచెన్‌జంగాను కూడా చాలామందే ఎక్కుతుంటారు. కానీ పైన కొద్ది అడుగుల దూరంలో ఆగిపోతారు. ఎందుకంటే దీన్ని స్థానికులు దేవతగా భావిస్తారు. ఈ పర్వతంపై మొత్తం అయిదు శిఖరాలు ఉన్నాయి. వీటిల్లో బంగారం, వెండి, రత్నాలు, ధాన్యం, పవిత్ర గ్రంథాలు వేర్వేరుగా నిధులుగా ఉన్నాయని స్థానికుల నమ్మకం. అయితే ఈ పర్వతాన్ని తొలిసారిగా 1955 మే 25న జో బ్రౌన్, జార్జ్ బాండ్ అనే బ్రిటిష్ పర్వతారోహకులు ఎక్కారు. వాళ్లు ఎక్కే ముందే సిక్కిం మహారాజు పర్వతం శిఖరం పై వరకు వెళ్లొద్దని, కొన్ని అడుగుల దూరంలోనే ఆగాలని మాటతీసుకున్నారు. వాళ్లు అలాగే చేశారు. దీన్ని అధిరోహించే వాళ్లంతా ఇప్పటికీ పూర్తిగా పైవరకు ఎక్కకుండా ఇదే నిబంధన పాటిస్తారు.
==విశేశాలు==
* ఈ పర్వతం కొంత ప్రాంతం నేపాల్‌లో కూడా ఉంది. నేపాల్‌లో ఎవరెస్టు తర్వాత ఎత్తయినది ఇదే.
*కాంచెన్‌జంగా పేరు టిబెట్ భాషనుంచి వచ్చింది. దీనికి ఎత్తులో ఉన్న మంచు అని అర్థం. నేపాల్, భూటాన్ తదితర ప్రాంతాల్లో మాట్లాడే లింబు భాషలో దీన్ని 'సెవాలుంగ్మా' అని పిలుస్తారు. అంటే పూజించే పర్వతం అని!
*సూర్యకాంతినిబట్టి రంగులు మారుతుంది.
*గ్యాంగ్‌టక్ వద్ద ఈ పర్వతం ఎక్కడానికి బేస్‌క్యాంప్ ఉంది. దీని విహంగ వీక్షణానికి సిక్కిం ప్రభుత్వం హెలికాప్టర్ ట్రిప్ ప్రారంభించింది.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/కాంచెన్‌జంగా" నుండి వెలికితీశారు