ఉష (గాయని): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
ఉష 1996 నుండి 2000 మధ్య అనేక సంగీత ప్రాధాన్యం గల టెలివిజన్ షోలలో పాల్గొన్నది. "జెమిని టెలివిజన్" వారి "ఎందరో మహానుభావులు" కార్యక్రమంలో పాల్గొని శ్రోతల,వీక్షకుల అభిమానాన్ని చూరగొంది. తర్వాత ఆమె "స్టార్ టీ.వీ" లోని "మేరీ ఆవాజ్ సునో" కార్యక్రమంలో పాల్గొని ఆల్ ఇండియా ఫైనల్స్ లోనికి ఎంపికయింది. ఆమె "జీ టీ.వీ" మరియు ఇ.ఎల్.టి.వి. వంటి వివిధ హిందీ టెలివిజన్ కార్యక్రమాలలో కూడా పాల్గొని విశేష ఖ్యాతి పొందింది.
==చలన చిత్రాలలో ===
 
ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు [[వందేమాతరం శ్రీనివాస్]] వద్ద తొలి అవకాశాన్ని పొందింది. ఆమె మొదట పాడిన పాట [[ఇల్లాలు]] చిత్రంలోనిది. ఆమె 2000 సంవత్సరం నుండి తెలుగు చిత్ర సీమలో నేపధ్యగాయకురాలిగా అనేక పాటలు పాడింది. తెలుగు చిత్ర సీమలో ఆమె [[ఇంద్ర]] , [[చిరుత]] , [[అతిధి]] , [[పౌరుడు]] , [[వర్షం]] , [[భద్ర]] , [[చిత్రం]] , [[నువ్వు నేనూ]] , [[మనసంతా నువ్వే]] , [[నువ్వులేక నేను లేను]] , [[జయం]] , [[సంతోషం]] , [[నీ స్నేహం]] , [[అవునన్నా కాదన్నా]] వంటీ అనేక చిత్రాలలో తన నేపధ్య గానంతో అలరించింది.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ఉష_(గాయని)" నుండి వెలికితీశారు