డి.వి.నరసరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 44:
 
2006 ఆగష్టు 28న హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో మరణించాడు.<ref>[http://www.ragalahari.com/news/2360/writer-dvnarasa-raju-is-no-more.aspx Writer D.V.Narasa Raju is no more]</ref> ఈయనకు ఒక కూతురు కవిత. సినీ నటుడు సుమన్ భార్య నరసరాజు మనవరాలే.
==సినిమా దర్శకుడిగా==
 
సుప్రసిద్ధ రచయిత డి.వి.నరసరాజు గారు సినిమాలకు రాకముందు నాటకాల్లో నటించే వారు. కాని, అతి బలవంతం మీద రెండుమూడు సినిమాల్లో నటించారు. నరసరాజు గారు ఉషాకిరణ్ మూవీస్ వారి 'కారు దిద్దిన కాపురం' డైరెక్టు చేశారు. కథ తయారు చేసి, స్క్రీన్‌ప్లే సంభాషణలు రాసిన తర్వాత మొత్తం నిర్మాత రామోజీరావు గారికి వినిపించారు. ఆయనకు బాగా నచ్చింది. అప్పుడు వచ్చింది ప్రశ్న. ''ఎవరు దర్శకుడు?'' అని. ఒక్క నిమిషం ఆలోచించి, ''మీరే డైరక్టు చెయ్యండి. మొత్తం అంటే అందులోనే వుంది కదా- అంతా మీరే చేశారు'' అన్నారట రామోజీరావు. నరసరాజుగారు ''ఆఁ?'' అని ముందు ఆశ్చర్యపోయి, తర్వాత 'అబ్బే' అన్నారట. తర్వాత [[రామోజీరావు]] గారి బలవంతంతో అంగీకరించారు. ఒక మిట్టమధ్యాహ్నం విజయగార్డెన్స్‌లో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పుడు [[రావి కొండలరావు]] అక్కదికి వెళ్లారు. వెళితే నరసరాజు గారు కనిపించలేదు. అడిగితే, కాస్త దూరంలో వున్న చెట్టు చూపించారు. నరసరాజు గారు చెట్టు నీడన నిలబడి వున్నారు. రావి కొండలరావువెళ్లి అడిగారు ''షాట్స్ రాసి ఇచ్చేశానయ్యా- డైలాగ్స్ ఏంలేవు. అంచేత వాళ్లు తీసేయొచ్చు. నీడగా వుందని ఇలా నించున్నాను'' అన్నారాయన. ''హాయిగా ఏసి రూమ్‌లో కూచుని స్క్రిప్ట్ రాసుకునే మీకు ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది దర్శకత్వం అంటే'' అన్నారు రావి కొండలరావు ఆయనకున్న చనువుతో. ఆయన నవ్వి, ''అవుననుకో, కానీలే, ఇదొక అనుభవం. మళ్లీ డైరక్టు చేస్తానాయేం?'' అన్నారు నరసరాజు. అప్పుడే, పైన చెప్పిన విషయం చెప్పారు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/డి.వి.నరసరాజు" నుండి వెలికితీశారు