రఘుబాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
 
'కబడ్డీ కబడ్డీ' కూతతో ఇతని నట ప్రయాణం కామెడీ వైపుకి మళ్లింది. అందులో టీ అమ్ముతుంటాడు. 'కప్పు టీ...కప్పు టీ' అని అరుస్తుంటాడు. ఈ సినిమాలో కామెడీ గ్యాంగ్ చాలా ఉంది. అందులో ఇతనికీ కావల్సినంత పేరొచ్చింది''
 
జంథ్యాల తర్వాత వినోదాత్మక చిత్రాలు చేయడంలో దిట్ట అనిపించుకొన్నది [[ఈవీవీ సత్యనారాయణ]]. 'బెండు అప్పారావు'లో ఇతని బాడీ లాంగ్వేజ్‌ని పూర్తిగా మార్చేశారాయన. కడుపుబ్బ నవ్వించే పాత్రిచ్చారు. 'రఘుబాబు ఈస్థాయిలో కామెడీ చేయగలడా?' అనిపించేంతలా చేశారు. అవటానికి పాలేరు పాత్రే, అయినా భలే పేరొచ్చింది''.
 
ఈవీవీగారి శిష్యుడు సత్తిబాబు దర్శకత్వం వహించిన 'బెట్టింగ్ బంగార్రాజు'లో అమాయకుడిగా కనిపించి నవ్వించాడు. ఇదో కొత్తకోణం. ఉమ్మడి కుటుంబ సభ్యుల్లో అమాయకుడిని అవడంతో మిగతా వాళ్లు ఇతడిని ఆడిస్తారు, ఆడుకుంటారు. అమాయకంగా చేయాలంటే బాడీ లాంగ్వేజ్, మాటా, నడతా తీరుల్లో స్పష్టమైన మార్పు కనబరచాలి. దర్శకుడి సూచనలు, అవగాహనలతో ఆ పాత్రని పండించాడు. ఇతని ముఖంలో ఆ మాయా ఉందని ప్రేక్షకుల చేత అనిపించుకున్నాడు'.
 
ఇవన్నీ ఒకెత్తయితే [[అల్లు అర్జున్]] '[[బన్ని]]' సినిమాలో చేసిన గూండా పాత్ర ఒక ఎత్తు. ఓ సందర్భంలో ఇతని కళ్లు పోతాయి. ఆ తరవాత వీడి తిప్పలు చూసి జనం బాగా నవ్వుకొన్నారు. సీరియస్‌గా ఉంటాడు కానీ, ఆ పాత్రతో ఎంత వినోదం పండిందో? ఈ సినిమాకి నంది అవార్డు వస్తుందనుకొన్నాడు. కానీ రాలేదు.
 
క్రిష్ సినిమా '[[కృష్ణం వందే జగద్గురుం]]'లో [[రానా]]కి బాబాయి పాత్ర. ఓ సందర్భంలో ప్రత్యర్థులు ఇతని నాలుక కోసేస్తారు. ఆ తరవాత వచ్చేసీన్‌లో ఇతడి నటన కంటతడిపెట్టించింది. నటుడిగా మంచి పేరొచ్చింది. గుడ్డి, మూగ ఇలాంటి పాత్రలు చేయాలని నటులు కోరుకుంటారు. ఎందుకంటే.. నటుడికి ఈ పాత్రలు ఓ పరీక్ష. ఆ పరీక్షలో ఇతడు నెగ్గాడు.
 
సుశాంత్ కరెంట్‌లో జాంపళ్లు అమ్ముతాడు. ఇప్పటికీ విశాఖ, రాజమండ్రి రైల్వేస్టేషన్లలో ఇతడిని కలిసినవాళ్లంతా. 'కరెంట్ సినిమాలో జామపళ్లు అమ్మారు కదండీ.. ఆ సీను భలే బాగుంటుందండీ..' అంటుంటారు
 
శ్రీనివాసరెడ్డి '[[టాటా బిర్లా మధ్యలో లైలా]]'లో దొంగస్వామీజీ వేషం వేయించారు. ప్రజల్ని మాయ మాటలతో మోసం చేసి డబ్బులు గుంజేసే దొంగ సన్యాసి. అందులో ఇతని పాపులర్ డైలాగ్ 'ఆశ దోశ అప్పడం వడ'. ఈ డైలాగ్ ఆ తరవాతి కాలంలో చాలా పాపులర్ అయ్యింది.
 
సుకుమార్ సినిమా జగడంలో రామ్‌కి తండ్రిగా నటించే ఛాన్స్ ఇచ్చారు. చాలా బాధ్యతగల, బరువైన పాత్ర అది. ఇతని కరకు ఫేసులోంచి అంత సున్నితమైన హావభావాల్ని సుకుమార్‌గారు రాబట్టారు. ఈ సినిమా చూశాక వినాయక్ గారు ''రఘుబాబులో ఇలాంటి నటుడు దాగున్నాడా!'' అని ఇతని ముందే అన్నారు. ఇది చూసే క్రిష్ 'కృష్ణం వందే జగద్గురుం'లో అవకాశమిచ్చారు.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/రఘుబాబు" నుండి వెలికితీశారు