అనంత శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 13:
 
[[అనంత శ్రీరామ్]] (జననం ఏప్రిల్ 8, 1984) ప్రముఖ సినీ గీత రచయిత. ఆయన స్వస్థలం [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[దొడ్డిపట్ల]]. తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి.
ప్రాథమిక విద్య దొడ్డిపట్ల లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడ లోనూ, ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేశాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు [[చేగొండి హరిరామ జోగయ్య]] అనంత్ కు వరుసకు పెదనాన్న అవుతాడు.
==సినీ ప్రస్థానం==
12ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించాడు. ఇతనికి గురువంటూ ఎవరూ లేరు. ఇతని నాన్నగారు వీరవెంకట సత్యనారాయణ మూర్తికి సాహితీవేత్తలతో ఉన్న పరిచయం వల్ల సినీ గేయ రచయితను కాగలిగాడు. మొదటిసారిగా [[కాదంటే ఔననిలే]] చిత్రంలో అవకాశం లభించింది. 2006లోనే హైదరాబాద్ వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు. 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. [[అందరివాడు]] సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది. సిరివెన్నల సీతారామశాస్త్రి పాటలు అంటే ఇష్టపడతాడు.
"https://te.wikipedia.org/wiki/అనంత_శ్రీరామ్" నుండి వెలికితీశారు