ఆంధ్రప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
[[బొమ్మ:AP Amaravthi sculpture Padma.JPG|thumb|200px|అమరావతి స్థూపంపై చెక్కిన పద్మం]]
[[బౌద్ధమతం]] ఆరంభ దశనుండి ఆంధ్ర ప్రదేశ ప్రాంతలో విశేషమైన ఆదరణ పొందింది. [[అశోకుడు|అశోకునికి]] ముందే, అనగా [[గౌతమ బుద్ధుడు|బుద్ధుని]] కాలం నుండే ఆంధ్రదేశంలో బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉన్నదని పెక్కు ఆధారాల వల్ల తెలియవస్తుంది. బౌద్ధ ధర్మం ఆంధ్ర జాతిని సమైక్య పరచి వారి కళానైపుణ్యానికి, సృజనా సామర్ధ్యానికి, నిర్మాణ నైపుణ్యానికి, తాత్విక జిజ్ఞాసకు అపారమైన అవకాశం కల్పించింది. సుప్రసిద్ధ దార్శనికులు అయిన [[నాగార్జునుడు]], [[ఆర్యదేవుడు]], [[భావవివేకుడు]], [[దిజ్ఞాగుడు]] వంటి వారికు ఆంధ్రదేశం నివాసభూమి అయ్యింది. థేరవాదులకు మగధవలె మహాయాన బౌద్ధులకు ఆంధ్రదేశం పవిత్ర యాత్రాస్థలం అయ్యింది.<ref name="BSL">ఆంధ్రుల చరిత్ర - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్)</ref>
 
తూర్పున శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం నుండి విజయనగరం జిల్లాలోని రామతీర్ధం వరకు, పడమర కరీం నగర్ జిల్లా ధూళికట్ట నుండి వైఎస్ఆర్ జిల్లా ఆదాపూర్ వరకు ఆంధ్రదేశం నలుమూలలలో అనేక బౌద్ధ క్షేత్రాలు వెలిశాయి. క్రీ.పూ. 300 నుండి క్రీ.శ.300 వరకు, 600 సంవత్సరాలు ఆంధ్రావనిలో జీవితం ప్రగాఢంగా బౌద్ధం ప్రభావంలో ఉంది. కుల వ్యవస్థ లోని దురభిమానం ఆనాటి శాసవాలలో కానరాదు. విధికుడు అనే చర్మకారుడు సకుటుంబంగా అమరావతి స్థూపాన్ని దర్శించి బహుమతులు సమర్పించినట్లు అక్కడి ఒక శాసనం ద్వారా తెలుస్తుంది. ఆ కాలంలో వర్తకం, వ్యవసాయం, వృత్తిపనులు సర్వతోముఖంగా విస్తరించాయని అనేక ఆధారాల ద్వారా తెలుస్తున్నది.
[[File:Buddhist sites map of Andhra Pradesh.jpg|thumb||200px|right|ఆంధ్ర ప్రదేశ్‌లో బౌద్ధమతం స్థూపాలున్న ముఖ్య క్షేత్రాలు.]]
==బౌద్ధం ఆరంభ కాలంలో==
పంక్తి 10:
 
అశోకుడు "మొగలిపుత తిస్స" ఆధ్వర్యంలో నిర్వహించిన మూడవ బౌద్ధ మండలికి ఆంధ్రదేశంనుండి ఆరు సంప్రదాయాలకు చెందిన ప్రతినిధులు (చైత్యకులు, పూర్వశైలురు, అపరశైలురు, ఉత్తర శైలురు, రాజగిరికులు, సిద్ధార్థికులు) వెళ్ళారు. మౌర్య సామ్రాజ్యం పతనమైనాక దక్కనులో శాతవాహనులు, ఉత్తరాన కుషాణులు బౌద్ధాన్ని ఆదరించారు.
అశోకుని శిలాశాసనం ప్రకారం ఆంధ్ర దేశం అప్పటికే "ధర్మవిషయం"లో ఉంది. [[గుంటుపల్లి]], [[భట్టిప్రోలు]], [[పావురాలకొండ]], [[బావికొండ]], [[తొట్లకొండ]] వంటి బౌద్ధ క్షేత్రాలు హీనయాన బౌద్ధం కాలం నాటివి. (క్రీ.పూ. 300 నాటివి.) విశేషించి భట్టిప్రోలును బుద్ధుడే స్వయంగా సందర్శించాడని ఒక అభిప్రాయం ఉంది (బుద్ధుని జీవిత కాలంలో దక్షిణ భారతానికి రాలేదు అన్న అభిప్రాయం కూడా ఉంది). భట్టిప్రోలులోని ధాతు కరండం బుద్ధుని శరీర ధాతువులకు చెందినది కావచ్చును. అశోకుని కాలంలోను, తరువాత శాతవాహనుల కాలంలోను బౌద్ధాన్ని రాజకుటుంబాలు విశేషంగా ఆదరించాయి. రాజులు హిందూమతావలంబులైనా గాని రాణివాసం బౌద్ధ సంఘాలకు పెద్దయెత్తున దానాలు చేసినట్లు ఆధారాలున్నాయి. ఉత్తర హిందూస్థానానికి, శ్రీలంకకు మధ్య జరిగిన బౌద్ధ పరివ్రాజకుల రాకపోకలలో [[వేంగి]] దేశం ముఖ్యమైన మార్గం మరియు కూడలిగా ఉండేది.<ref>[http://www.lakehouse.lk/mihintalava/gaya02.htm Mihintalava - The birthplace of Srilankan Buddhist civiization] At a place called Vengi, many such routes converged. Its importance was recognized very early in history and later Andhra kings even set up their capital at Vengi. In fact, Andhra Pradesh itself was often known as Vengi and the Andhra kings as Vengi kings. .. The road to Kalinga, led to the north-eastern part of India. The road to Dravida or the South was different from the road to the South-West, which led to Karnataka. Similarly, there were two other roads, one leading to the city of Kosala and the other to the modern day state of Maharashtra. It was along these roads that Buddhist monks travelled and brought with them ideas and influences just as they took back bits of Andhra culture.</ref>
 
==మహాయాన కాలం==
[[బొమ్మ:AP Amaravathi Stupam model.JPG|right|thumb|200px|అమరావతి స్థూపం నమూనా]]
మహాయానానికి ఆంధ్రదేశం జన్మస్థలం అనవచ్చును. ఇక్కడినుండి "మాధ్యమిక వాదం" లేదా "శూన్యవాదం" సిద్ధాంతకారుడు [[నాగార్జునుడు]] మహాయానానికి ఊపిరి పోశాడు. ఆర్యదేవుడు (మాధ్యమిక వాదం వ్యాఖ్యాత), బుద్ధపలితుడు (మాధ్యమిక వాదంలో ప్రసంగిక సంప్రదాయానికి ఆద్యుడు), భావవివేకుడు (స్వతంత్రిక సంప్రదాయం గురువు), దిజ్ఞాగుడు (బౌద్ధ మీమాంస కారుడు) , ధర్మకీర్తి (తర్కంలో నిష్ణాతుడు) తరువాతి మూడు శతాబ్దాలలోను బౌద్ధానికి దీపస్తంభాలలా నిలచారు. థేరవాద సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన బుద్ధఘోషుడు 4వ శతాబ్దంలో పలనాడు ప్రాంతం లో జన్మించాడు. త్రిపిటకాలపై అతని "విశుద్ధి మాగ్గ" అనే భాష్యం థేరవాదంలో అనన్యమైన గౌరవం కలిగి ఉన్నది.<ref name="Bhikku"/>
[[File:Bavikonda Mahastupa Visakhapatnam AP.jpg|thumb|200px|[[బావికొండ]] మహా స్తూపం]]
[[బొమ్మ:Guntupalli Buddist site 8.JPG|thumb|మధ్య|200px|గుంటుపల్లి స్థూపాలు]]
ధరణికోట, విజయపురి వంటి మహారామాలు ఆంధ్రదేశంలో బౌద్ధం అత్యున్నత స్థితిలో ఉన్ననాటి చిహ్నాలు. ఆంధ్రదేశంలో కృష్ణాతీర వర్తకులు విదేశాలతో విరివిగా వ్యాపారం సాగించారు. తమ సంపదను బౌద్ధధర్మం ఆదరణకు విరివిగా వెచ్చించారు. ఆంధ్ర దేశంలో బౌద్ధాన్ని అధికంగా వర్తకులు మరియు సామాన్య జనం విశేషంగా ఆదరించారు. [[శాతవాహనులు]], [[ఇక్ష్వాకులు]], [[తూర్పు చాళుక్యులు]] వంటి పాలకులు వైదిక మతావలంబులైనా గాని బౌద్ధాన్ని కూడా కొంతవరకు ఆదరించారు. వారి రాణివాస జనం చాలామంది మాత్రం బౌద్ధం పట్ల యెనలేని ప్రేమతో విశేషంగా ఆరామాలకు దానాలు చేశారు. నాగార్జునుని కాలంనుండి మహాయానం విశేషంగా ఆంధ్రదేశంలో వర్ధిల్లింది. వజ్రయానం కూడా కొంతవరకు ఆదరింపబడినప్పటికీ అప్పటికే వైదికమతం పుంజుకోవడంతో బౌద్ధం క్షీణించసాగింది.
[[బొమ్మ:AP Chandavram BudhistChaitya Panel.JPG|right|thumb|200px|చందవరం బౌద్ధచైత్యం శిలాఫలకంమీద ఒక స్థూపం నమూనా]]
==స్థూపాలు, చైత్యాలు==
పంక్తి 23:
బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూను, సంఘారామాలలో నివశిస్తూను ధర్మ ప్రచారం సాగించారు. ఆరాధన నిమిత్తం సంఘారామాలలో స్థూపాలు, చైత్యాలు నిర్మించుకొన్నారు. బౌద్ధుల స్థూపాలలో మూడు రకాలున్నాయి.
 
'''ధాతుగర్భ స్థూపాలు''': బుద్ధునివి గాని, ప్రముఖ ఆచార్యులవి గాని అయిన అవశేషాలపై నిర్మించినవి.
 
'''పారిభోజిక స్థూపాలు''': భిక్షాపాత్ర వంటి వస్తువులపై నిర్మించినవి.
పంక్తి 29:
'''ఉద్దేశిక స్థూపాలు''': ధాతువులు లేకుండా స్మారకచిహ్నంగా నిర్మించినవి.
 
బుద్ధుని నిర్వాణం తరువాత అతని ధాతువులపై 8 చైత్యాలను నిర్మించారు. తరువాత వాటిలో ఏడింటిని తెరిపించి అశోకుడు అందులోని శకలాలను చిన్న ఖండాలుగా చేసి 84 వేల స్థూపాలను కట్టించాడని ఒక ప్రతీతి ఉంది. ఈ ప్రతీతిలో కొంత నిజమున్నదని చరిత్రకారులు భావిస్తున్నారు. కాలక్రమంలో బుద్ధుని లేదా ఇతర గురువుల వస్తువులపై కూడా ఇలాంటి చైత్యాలను నిర్మించడం మొదలుపెట్టారు. కాలాంతరంలో చైత్యమనే పదం వృక్ష వేదికకు గాని, సంపూర్ణ దేవాలయమునకు గాని, గర్భ గృహమునకు గాని వర్తించ సాగింది. కనుక చైత్యమనేది బౌద్ధ మతవిషయికమైన సాధారణ పదంగాను, స్థూపమనేది వస్తు విశేష సంబంధమయిన నిర్మాణ పదం (Architectural term for relic mound) గాను ఇటీవలి కాలంలో వ్యవహరింపబడుతున్నాయి. అసంఖ్యాకమైన అటువంటి స్థూపాలు ఆంధ్రదేశంలో ఎన్నో కనుగొనబడ్డాయి. వీటిలో అధికంగా కృష్ణాతీరంలో ఉన్నాయి. ఆ ప్రాంతం ఐశ్వర్యవంతమైనది మరియు అక్కడి (నాగ, యక్ష జాతి) ప్రజలు బౌద్ధాన్ని విశేషంగా ఆదరించడం అందుకు కారణాలు.
 
==కొన్ని ప్రసిద్ధ క్షేత్రాలు==
పంక్తి 38:
 
 
దక్షిణాపథ బౌద్ధ క్షేత్రాలన్నింటిలోకి అమరావతి తలమానికమైనది. దీని అప్పటిపేరు ధనకటక లేదా ధాన్యకటకం లేదా ధరణికోట. ఇక్కడ దొరికిన మౌర్య లిపి శాసనాల ఆధారంగా దీని నిర్మాణం అశోకుని కాలంలో జరిగిఉండవచ్చును. అశోకుడు దక్షిణాపథానికి పంపిన బౌద్ధభిక్షువు మహాదేవుడు అమరావతి కేంద్రంగానే తన ధర్మ ప్రచారం సాగించి ఉండవచ్చును. నాగార్జునుని మహాయానకాలంలో అమరావతి బౌద్ధవిజ్ఞానానికి పీఠమై జగద్విఖ్యాతమయ్యింది. చైనా యాత్రికుడైన [[హ్యూన్ త్సాంగ్]] తాను ధాన్యకటక విహారంలో అభిధమ్మపిటకాన్ని అభ్యసించినట్లు వ్రాసుకొన్నాడు. ఇక్కడి మహాచైత్యం ఆంధ్రుల నిర్మాణ చాతుర్యానికి, శిల్పకౌశల్యానికి గీటురాయి.
 
 
కృష్ణానదీ తీరాన వెలసిన మరొక ఆరామస్థానం జగ్గయ్యపేట అప్పటిలో "ఎలగిరి" అనబడేది. క్రీ.పూ.2వ శతాబ్దిలోనే ఇక్కడ మహాచైత్యవిహారాదులు వెలిశాయి. ఇక్కడి పుణ్యశాలా శిల్పంలో మహాబలిపురం రాతిరధాలను, అజంతా చిత్రాలను పోలిన రీతి ఉంది. మహాయాన సిద్ధాంతకర్త ఆచార్యనాగార్జునుని స్థానమైన శ్రీపర్వతంలోని మహాచైత్యవిహారాలు కూడా బుద్ధధాతువుపైనే నిర్మించినట్లు శాసనాధారాలున్నాయి. ఇక్కడి విహారాన్ని "పారావత విహారం" అని చైనా యాత్రికుడు [[ఫాహియాన్]] పేర్కొన్నాడు. ఇక్కడ ఐదు అంతస్తుల భవనంలో పెద్ద గ్రంథాలయం ఉండేది. సింహళదేశపు యాత్రికులకోసం ప్రత్యేక విహారాలుండేవి. ఇక్కడినుండి మహాయానం చైనా, టిబెట్ వంటి దేశాలకు వ్యాపించింది.
 
[[వేంగి]] ని హ్యూన్‌ త్సాంగ్ "పింగ్-కీ-లో" అని వ్రాశాడు. ఇక్కడ అచల అర్హతుడు ఇరవై సంఘారామాలు నిర్మించాడని, వాటిలో మూడువేల బౌద్ధ భిక్షువులు ఉండేవారని వ్రాశాడు. ఇక్కడ చైత్యగృహంలో జనబోధిసత్వుడు నివశిస్తూ తర్కశాస్త్రం వ్రాశాడట. ఆ జనబోధిసత్వుడే దిజ్ఞాగుడు అని చరిత్రకారులు భావిస్తున్నారు.
 
 
'''వజ్రయాన కేంద్రాలు''': ఉత్తరాంధ్ర తీరంలోని రామతీర్ధం, [[శాలిహుండం]], [[బొజ్జన్నకొండ]], సంఘరం వంటి క్షేత్రాలలో వజ్రయానపు చిహ్నాలు ఎక్కువగా కనిపిస్తాయి. కళింగపట్నం రేవునుండి వజ్రయానం సుమత్రాదీవులకు పయనించి ఉండవచ్చును. సంఘరం అసలు పేరు సంఘారామం కావచ్చును. ఆరామతీర్ధం రామతీర్ధంగా పరిణమించి ఉండవచ్చును. ‍‌బొజ్జన్నకొండలోని లింగాలమెట్టయే బోరోబదూరు బౌద్ధక్షేత్రానికి నమూనా అయ్యిందని ఒక అభిప్రాయం<ref name="BSL"/>.
 
 
ఇవే కాకుండా గుమ్మడిదుర్రు, గుడివాడ(కృష్ణా జిల్లా), ఘంటసాల, విద్యాధరపురం, బుద్ధాం, చినగంజాం, ఫణిగిరి, కొండాపూర్, ముంజలూరు, కుమ్మరిలోవ, తగరపువలస(గుడివాడ దిబ్బ)<ref>http://www.thehindu.com/news/states/andhra-pradesh/evidence-of-buddhist-site-found/article3980627.ece</ref>, సరిపల్లి వంటి అనేక క్షేత్రాలు కనుగొనబడ్డాయి. అమరావతితో సహా '''పంచారామాలు''' మొదట బౌద్ధ క్షేత్రాలుగా ఉండేవని ప్రతీతి.
== చిత్రమాలిక ==
<gallery>
పంక్తి 58:
 
==ముఖ్యమైన క్షేత్రాల జాబితా==
క్రీ.పూ. 3వ శతాబ్ది నుండి క్రీ.శ. 14వ శతాబ్దం వరకు బౌద్ధమతారాధనలో వివిధ దశలను సూచించే 140 కి పైగా బౌద్ధక్షేత్ర స్థలాలను ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించారు. వీటిలో లభించే లిఖిత ఆధారాలు మొత్తం 501 (360 శిలా శాసనాలు, 7 రాగి రేకులు, 134 కుండలు, శంఖాలవంటి వస్తువులపై వ్రాసినవి). ఈ కాలంలో ఆంధ్రదేశంలో జీవనం, కళ, సంస్కృతి బౌద్ధంవల్ల బలంగా ప్రభావితమయ్యాయి. అంతకు ముందు జాతులు, తెగల మధ్యనున్న అగాధాలు పూడుకుపోయి సంస్కృతిలో క్రొత్త బాటలు నెలకొన్నాయి. ముఖ్యంగా అమరావతి, నాగార్జునకొండ వంటి చోట్ల శిల్పకళ, విద్యాధ్యయనం ప్రభవించాయి. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలలో 14 ధాతుపేటికలు లభించాయి. ఇవి ఏ ఇతర రాష్ట్రంలో లభించిన వాటికంటే ఎక్కువ. <ref name="Bhikku"/>