ఉప్పులూరి సంజీవరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''ఉప్పులూరి సంజీవరావు''' 20వ శతాబ్దపు ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు, గాయకుడు.<ref>[http://www.cinegoer.net/telugucinema8.htm?ModPagespeed=noscript History Of Birth And Growth Of Telugu Cinema (Part 8) - cinigoer.com]</ref>
 
నటుడు, మైలవరం బాలభారతీ సమాజంలో నాయికా పాత్రధారుడైన ఉప్పులూరి సంజీవరావు కృష్ణాజిల్లా పామర్రులో 1889 జూన్ లో జన్మించాడు.
శృంగార, కరుణ రసాభినయంలో దిట్ట. సావిత్రి పాత్రలో రసవత్తరంగా నటించడం వల్ల సావిత్రి సంజీవరావు అనే పేరు వచ్చింది. సంజీవరావు చిన్నతనంలో పదమూడవ ఏటనే బందరు బుట్టయ్యపేట కంపెనీలో చేరి బాల పాత్రలో నటించాడు. పదహారవ ఏట స్త్రీ పాత్రలో నటించడం ప్రారంభించాడు.
సొంతంగా ఒక నాటక సంస్థను స్థాపించాడు. దీంతో సంజీవరావు కీర్తి నలుదిశలకు వ్యాపించింది. మైలవరం రాజా ఆహ్వానంతో నెల జీతం మీద మైలవరం కంపెనీలో చేరాడు.<ref>[http://www.prabhanews.com/specialstories/article-18063 నాటక భిక్షపెట్టిన మైలవరం రాజా! - ఆంధ్రప్రభ - 31 జూలై 2009]</ref> ఈయన నటించిన సావిత్రి, ద్రౌపది పాత్రలు చూడడానికి దూరప్రాంతాల నుంచి జనం వచ్చేవారు. సావిత్రి నాటకంలో ‘‘పోవుచున్నాడె నా విభుని ప్రాణంబులు గొని’’ అని పాడిన పాట ప్రేక్షక హృదయాలను ద్రవీభూతం చేసేది.
 
== నటించిన పాత్రలు ==