కాజోల్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 3:
| image =Kajol Vogue cropped.jpg
| image_size =
| caption = 2012 లో [[m:en:Vogue (magazine)|వోగ్]] బ్యూటీ అవార్డ్స్ కార్యక్రమంలో కాజోల్
| birth_date = {{Birth date and age|df=yes|1974|8|5}}
| birth_place = [[ముంబై]], [[మహారాష్ట్ర]], భారత్
| years_active = 1992–2001, 2006–2012
| occupation = సినీ నటి
| religion =
| spouse = {{married|[[అజయ్ దేవ్‌గణ్]]|1999}}
| children = 2
పంక్తి 16:
'''కాజోల్ ''' ఒక భారతీయ సినీ నటి. ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించింది. [[షారుక్ ఖాన్]] మరియు కాజోల్ జోడీ [[బాలీవుడ్]] లో హిట్ పెయిర్ గా ఖ్యాతిచెందింది.
==నేపధ్యము==
ఈవిడ తల్లి [[తనూజ]]. ప్రముఖ నటి. తండ్రి పేరు షోము ముఖర్జీ. ఆయన దర్శకనిర్మాత. ఇద్దరూ కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారే కావడంతో... చిన్నప్పట్నుంచీ చుట్టూ సినిమా వాతావరణమే. కానీ తల్లిదండ్రులిద్దరూ ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటంతో ముంబైలోని పాంచ్‌గనిలో సెంట్ జోసెఫ్ కాన్వెంట్ బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు. క్లాస్‌లో హెడ్‌గాళ్. చదువు కంటే ఇతర వ్యాపకాలపైనే ఆసక్తి. డ్యాన్స్ నేర్చుకొంది. ఫిక్షన్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకొంది. అవే జీవితంలో ఎదిగేందుకు దోహదపడ్డాయని చెబుతుంటుంది. ఫిక్షన్ నవలలు చదవడం వల్ల కష్టాల్ని అలవోకగా అధిగమించానని చెబుతుంటుంది.
 
కాజోల్ తల్లిదండ్రులు మాత్రమే కాదు, వారి కుటుంబమంతా సినిమా పరిశ్రమలోనే ఉంది. [[నూతన్]], శోభన్ సమర్థ్, రతన్ బాయి, [[జాయ్‌ముఖర్జీ]], దేవ్‌ముఖర్జీ, శశిధర్ ముఖర్జీ... ఇలా కాజోల్ బంధువులంతా సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. కాజోల్ కజిన్స్ కూడా సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. [[రాణీముఖర్జీ]], షర్వాణీ ముఖర్జీ, మోనిష్ భెల్, దర్శకుడు అయాన్‌ముఖర్జీ... ఇలా అందరూ కూడా పరిశ్రమలో రాణిస్తున్నారు. కాజోల్‌కి స్వయానా ఓ చెల్లి ఉంది. ఆమె పేరు [[తనీషా]]. తెలుగులోనూ నటించింది.
 
==సినీరంగ ప్రవేశము==
తల్లిదండ్రులిద్దరూ సినిమా పరిశ్రమకు చెందినవారు కావడంతో పదహారేళ్లకే తొలి అవకాశం వచ్చింది. రాహుల్ రవైల్ దర్శకత్వంలో 'బెఖుడి'లో నటించే అవకాశాన్ని సంపాదించింది. వేసవి సెలవులు కావడంతో స్కూల్‌కి ఇబ్బంది కలగకుండా సినిమా పూర్తి చేసింది. అయితే ఆ సినిమా పరాజయాన్ని చవిచూసింది. అయినా... కాజోల్ నటన, అందం చూసి అప్పటికే '[[బాజీగర్]]' సినిమా కోసం ఎంపిక చేసుకొన్నారు. 1993లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాజీగర్' వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సొంతం చేసుకొంది. దీంతో బాలీవుడ్ దృష్టిలో పడింది. చదువులు పూర్తి కాకమునుపే స్కూల్‌కి గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయిలో సినిమాపై దృష్టిపెట్టింది.
 
1994లో 'ఉదార్ మే జిందగీ' అనే చిత్రంలో జితేంద్రకి మనవరాలిగా నటించింది. ఈ చిత్రం తెలుగులో విజయవంతమైన '[[సీతారామయ్యగారి మనవరాలు]]'కి రీమేక్‌గా తెరకెక్కింది. ఆదరణకు మాత్రం నోచుకోలేదు. ఆ వెంటనే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో 'యే దిల్లగీ' చేసింది. [[అక్షయ్‌కుమార్]], [[సైఫ్ అలీఖాన్]] సరసన నటించింది. 1995లో 'కరణ్ అర్జున్', '[[దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే']] చిత్రాలు చేశాక ఇక కాజోల్‌కి వెనుదిరిగి చూసుకొనే అవకాశం రాలేదు. ఆ చిత్రాలు సంచలన విజయాలు సొంతం చేసుకోవడంతో కాజోల్ పేరు మార్మోగిపోయింది.
పంక్తి 30:
 
==వ్యక్తిగత జీవితము==
'గుండారాజ్'లో నటిస్తున్నప్పుడు అజయ్ దేవగణ్‌తో ప్రేమలో పడింది. 1994లో మొదలైన ప్రేమాయణం 1999దాకా కొనసాగింది. 24 ఫిబ్రవరి 1999న మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం అజయ్ దేవగణ్ ఇంట్లో పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య నిరాడంబరంగా పెళ్లి జరిగింది. అజయ్ దేవగణ్, కాజోల్ జోడీ గురించి అప్పట్లో రకరకాల చర్చలు సాగాయి. ఇద్దరిదీ సరైన జోడీ కాదంటూ పలువురు వ్యాఖ్యానించారు. కాజోల్ కెరీర్ విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో పెళ్లి చేసుకోవడం పట్ల కూడా విమర్శలొచ్చాయి. అయితే ఇద్దరూ వాటిని బేఖాతరు చేశారు. ఓ ఇంటివారై కలిసి నడిచారు. ఆ జంటకి ఇద్దరు పిల్లలున్నారు. నైసా అనే అమ్మాయితో పాటు, యుగ్ అనే అబ్బాయి ఉన్నాడు.
==సామాజిక సేవ==
పెళ్ళి తర్వాత ఎక్కువగా అతిథి పాత్రల్లో కనిపిస్తున్న కాజోల్... సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. చిన్నారులు, వితంతువుల సంక్షేమం కోసం పలు స్వచ్ఛందే సేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఆ విషయంలో కాజోల్‌కి కర్మవీర్ పురస్కారం లభించింది.
 
==అభిరుచులు==
* ముద్దు పేరు కాడ్స్ అని పిలుస్తుంటారు.
*ఇష్టమైన నటులు అంటూ ఎవ్వరూ లేరు. ఇష్టమైన నటి అమ్మ తనూజ.
*పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. సైన్స్ ఫిక్షన్, హార్రర్ నవలల్ని బాగా చదువుతుంది.
* ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది.
*తెలుపు రంగు అంటే ఎంతో మక్కువ. ఈమె దుస్తుల్లో ఆ రంగువే ఎక్కువగా ఉంటాయి.
* సంగీతం అంటే ఇష్టమే. ఖాళీ సమయాల్లో పాత హిందీ పాటలు, ఖవాలీ పాటలు, పాప్ గీతాలు వింటుంది.
* ఇష్టమైన ప్రదేశం యూరప్.
*జీవితంలో ఓ గొప్ప మలుపు అంటే... ఈవిడ పెళ్లి అనే చెబుతుంది. మార్గదర్శనం లేని జీవితాన్ని గడిపేదాన్ని. పెళ్లితో ఈవిడ జీవితం ఓ కొత్తదారిలోకి అడుగుపెట్టింది అని అభిప్రాయపడింది.
*సెట్స్‌పై ఈవిడ బాగా ఇబ్బంది పడిన సందర్భం ఒకటే ఒకటి. '[[మెరుపు కలలు]]' సినిమాలో [[ప్రభుదేవా]]తో కలిసి నటిస్తున్నప్పుడు. ఆయనతో కలిసి డ్యాన్స్ వేయడం కోసం బోలెడన్ని టేకులు తీసుకొనేది.
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/కాజోల్" నుండి వెలికితీశారు