కుర్తా: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ, ఇవి కూడా చూడండి, మూస, శుద్ధి
చి Wikipedia python library
పంక్తి 7:
 
==సాంప్రదాయిక (లాంగ్) కుర్తాలు==
[[మ్యాండరిన్ కాలర్]] ([[చైనీసు కాలర్]]) తో కూడి గానీ, అసలు కాలరే లేకుండా గానీ, మెడ నుండి తొడల వరకూ/భుజాల నుండి అరచేతుల వరకు కుర్తా శరీరాన్ని కప్పుతుంది. చేతుల వద్ద [[బొత్తా]]లు ఉండవు. ఛాతీ వద్ద [[కాజా]]లతో కూడిన, లేక [[నొక్కుడు బొత్తా]]లు రెండు లేదా మూడు ఉంటాయి. కుర్తాలు సాధారణంగా తెలుపే అయిననూ అప్పుడప్పుడూ వేరే రంగులలో ఉండగలవు. [[జేబు]]లు సాధారణంగా ఛాతీ వద్ద ఉండవు. కానీ నడుముకు ఇరువైపులా ఉంటాయి. పెన్ను, పాకెట్ బుక్, మొబైల్, పర్సు వంటివి భద్రపరచుకొనటానికి అనువుగా ఛాతీ వద్ద ఒక జేబు వ్యక్తిగతంగా కొందరు పెట్టించుకొంటారు. కుర్తా కి నడుముకు ఇరువైపులా ఒక్కో వెంటు (చీలిక) ఉంటుంది. కాళ్ళ కదలికలకి అడ్డు పడకుండా ఈ వెంటులు ఖాళీ స్థలాన్ని సృష్టిస్తాయి.
 
==ఆధునిక (షార్ట్) కుర్తాలు==
[[మన్మథుడు (సినిమా)]] లో [[అక్కినేని నాగార్జున]] వీటికి కొంత ఆధునికత జోడించి, సొబగులు అద్ది (చారలు, గడులు లేదా పూల డిజైను గల వస్త్రాలతో మరీ వదులుగా లేకుండా, శరీరానికి హత్తుకునేంత బిగుతుగా, మోచేతి నుండి కొద్దిగా బెల్-బాటం వలె వచ్చి, బొత్తాలు అసలు లేకుండా, ఛాతీ మధ్యభాగము బహిర్గతము అయ్యేలా, ఛాతీ వద్ద, అరచేతుల వద్ద ఎంబ్రాయిడరీ లు వేసి ఉండి, చొక్కా వలె పొడవు తక్కువగా ఉండే షార్ట్ కుర్తాలని [[ఆంధ్ర ప్రదేశ్]] లో మొట్టమొదటి సారిగా ధరించాడు. ఇవి విపరీతమైన జనాదరణ పొందాయి. వాస్తవానికి వీటి పేరు షార్ట్ కుర్తాలైనా, మన్మథుడు షర్ట్ లు గానే ఇవి జనానికి దగ్గరయ్యాయి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కుర్తా" నుండి వెలికితీశారు