కొమర్రాజు అచ్చమాంబ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహిళా రాజకీయనాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 24:
| source =
}}
'''కొమర్రాజు అచ్చమాంబ''' (1906-1964) ప్రముఖ వైద్యురాలు, న్యాయవాది, రాజకీయ నాయకురాలు మరియు మాజీ పార్లమెంటు సభ్యురాలు. స్త్రీల ఆరోగ్య సమస్యల గురించి విశేష కృషి చేసింది. విద్యార్థి దశనుండి అనేక జాతీయోద్యమాలలో పాలు పంచుకున్నది. ఆవిడ [[కొమర్రాజు లక్ష్మణరావు]] పుత్రిక.
 
అచ్చమాంబ చరిత్రకారుడు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, ఆయన భార్యకు 1906, సెప్టెంబరు 6న గుంటూరులో జన్మించింది. విద్యార్థి దశనుండే జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నది. 1924 లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సమావేశాలలో బాలికా సేవాదళానికి నాయకురాలిగా పనిచేసింది. 1928 లో మద్రాసు నగరంలో సైమన్ కమీషన్‌కు నిరసనగా నల్ల జెండాల ప్రదర్శనకు నాయకత్వం వహించింది. 1943 నుండి 1948 వరకు [[భారతీయ కమ్యూనిస్టు పార్టీ]] సభ్యురాలిగా ఉన్న అచ్చమాంబ, 1948లో సైద్ధాంతిక విభేదాల వలన కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెసులో చేరింది. 1957 లో కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా విజయవాడ నియోజకవర్గం నుండి రెండవ లోకసభకు ఎన్నికయ్యింది.
"https://te.wikipedia.org/wiki/కొమర్రాజు_అచ్చమాంబ" నుండి వెలికితీశారు