టైటానిక్ నౌక: కూర్పుల మధ్య తేడాలు

చి 14.99.167.198 (చర్చ) చేసిన మార్పులను Addbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొ...
చి Wikipedia python library
పంక్తి 11:
 
== విశేషాలు ==
ఆ కాలంలో టైటానిక్ నౌక విలాసంలోనూ, సౌకర్యంలోనూ దాని ప్రత్యర్థి నౌకలన్నింటినీ తోసిరాజంది. నౌకలోనే ఈతకొలను, [[వ్యాయామశాల]], టర్కిష్ బాత్ మరియు రెండు తరగతుల ప్రయాణీకులకు [[గ్రంధాలయం|గ్రంధాలయాలు]], [[స్క్వాష్]] కోర్టును కలిగి ఉండేది.<ref>{{cite web|title=టైటానిక్ గురించిన నిజాలు |url=http://www.titanic-nautical.com/titanic-facts.html}}</ref> మొదటి తరగతిలోని ఉమ్మడి గదులు, ఖరీదైన చెక్కతోనూ ఆకర్షణీయమైన అలంకరణలతోనూ, నిండి ఉండేది.<ref>{{cite web|title=టైటానిక్: ఎ వాయేజ్ ఆఫ్ డిస్కవరీ|url=http://www.euronet.nl/users/keesree/palace.htm}}</ref> . మొదటి తరగతి ప్రయాణీకులకు ''కెఫే పరీసియన్ (Café Parisien)'' శైలిలో వంటకాలు లభించేవి. ట్రెల్లిస్ అలంకరణలు చేయబడ్డ కొద్దిపాటి సూర్యరశ్మిని ప్రసరింపజేసే వరండా డైనింగ్ హాలులా ఉండేది.<ref>{{cite web |title=టైటానిక్ నిర్మాణము |url=http://www.titanicinbelfast.com/template.aspx?pid=248&area=1&parent=247}}</ref>
 
ఈ నౌకలో, ఆ కాలంలో అప్పుడే కొత్తగా అభివృద్ధి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం జరిగింది. విస్తృతమైన విద్యుదీకరణ వ్యవస్థ, నీటి ఆవిరితో నడిచే జనరేటర్లు ఉండేవి. రెండు శక్తివంతమైన [[మార్కోని]] రేడియో సెట్లు కూడా ఉండేవి. వీటిలో ఒకటి 1500 వాట్ల శక్తివంతమైనది. వంతుల వారీగా విధులు నిర్వర్తించే ఆపరేటర్లతో రేయింబవళ్ళు నడపబడుతుండటం మూలాన ఇది మిగతా ప్రపంచంతో ఎడతెరిపిలేని సంబంధాలు కలిగి ఉండేది. <ref>{{cite web |title=టైటానిక్ నౌకలో వైర్ లెస్ సౌకర్యాలు |url=http://jproc.ca/radiostor/titanic.html}}</ref>
 
== మొదటి ప్రయాణం ==
పంక్తి 25:
 
 
సముద్రపు [[నీరు]] ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. నాలుగు కంపార్ట్ మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్ తేలగలిగి ఉండేదే కానీ ఐదు కంపార్ట్ ‌మెంట్లూ నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. ఈ విధంగా మునిగిపోవడం వలన నీరు పైన ఉండే కంపార్ట్ మెంట్లకు కూడా ఎగదన్నింది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్థరాత్రి తరువాత థామస్ ఆండ్రూస్ మరియు ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్త పరచమని పురమాయించారు.
 
 
పంక్తి 61:
! బయటపడ్డది
|-
| మొదటి తరగతి ప్రయాణికులు
| 324
| 201
"https://te.wikipedia.org/wiki/టైటానిక్_నౌక" నుండి వెలికితీశారు