తుంబురుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
'''తుంబురుడు''' హిందువుల పురాణాల ప్రకారం [[గంధర్వుడు]]. [[సంగీతం]]లో ప్రవీణునిగా సుప్రసిద్ధుడు.
== సంగీత సంప్రదాయంలో ==
పరమశివుని డమరుక నాదం నుంచి జన్మించిన సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన నారద తుంబుర జంటలో ఒకడుగా ప్రసిద్ధి పొందాడు. వివిధ సంప్రదాయాలకు చెందిన భారతీయ సంగీతంలోని పలువురు వాగ్గేయకారులు, సంగీతవిద్వాంసులు తుంబురుని నారదునితో కలిపి గురువులుగా కీర్తించడమనే పరంపర ఉంది. ఆయన వీణకు ''కళావతి'' అని పేరు. పౌరాణిక గాథల్లో తుంబురుడు నారదుడు సంగీతంలో పోటీ పడినట్లుగా ఉంటుంది.<ref>[http://archive.andhrabhoomi.net/content/manchimaata-51 తుంబుర - నారదులు:వులాపు బాలకేశవులు:ఆంధ్రభూమి:20/10/2013]</ref>
== విష్ణుభక్తి ==
తుంబురుడు విష్ణుమూర్తికి మహాభక్తుడని పౌరాణిక ప్రసిద్ధి. తిరుమలలోని తుంబుర తీర్థానికి ఆ పేరు తుంబురుని వల్ల వచ్చింది. మాఘస్నాన మహాత్మ్యగాథలో కూడా తుంబురుని ప్రస్తావన వస్తుంది. తుంబురుడనే గంధర్వుడు మాఘమాస వ్రతాన్ని అతిక్రమించిన తన భార్యను శపించి ఘోణతీర్థంలో స్నానం చేసి వేంకటేశుని అర్చించి పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందాడనే కథ శ్రీవేంకటాచల మాహాత్మ్యంలో చెప్పారు.<ref>[http://www.prabhanews.com/devotional/article-107683 తుంబురుడు భార్యకు చెప్పిన మాఘ మాహాత్మ్యం:చింతన(కాలం):ఆంధ్రప్రభ:8-5-2010]</ref>
"https://te.wikipedia.org/wiki/తుంబురుడు" నుండి వెలికితీశారు