నూతన్ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 10:
| తండ్రి_పేరు =
| మరణం_తేదీ = {{Death date and age|2011|3|30|1945|12|12|df=yes}}
| మరణం_ప్రదేశం = [[హైదరాబాదు]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[భారతదేశం]]
| బిరుదులు =
| వేరే_పేరు =
పంక్తి 25:
నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన '''నూతన్ ప్రసాద్''' అసలు పేరు '''తడినాధ వరప్రసాద్'''. 1970వ మరియు 80వ దశకములో [[తెలుగు చలనచిత్ర|తెలుగు సినిమా]] రంగములో ప్రసిద్ది చెందిన హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు. మార్చి 30, 2011 బుధవారం హైదరాబాదులో అనారోగ్యంతో కన్ను మూశాడు.
 
హైదరాబాదులో ప్రభుత్వోద్యోగం చేస్తున్న ఆయన 1973 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి [[అక్కినేని నాగేశ్వరరావు]] నటించిన [[అందాల రాముడు]] చిత్రంతో చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత [[నీడలేని ఆడది]] మొదలైన చిత్రాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు [[ముత్యాల ముగ్గు]] చిత్రంలో [[రావుగోపాలరావు]] తో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చినది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు. ఈయన తనదైన శైలిలో పలికే సంభాషణలతో ప్రతినాయక పాత్రలకు హాస్యవన్నె లద్దారు.అనేక చిత్రాలలో అగ్ర నటులైన [[నందమూరి తారక రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[ఘట్టమనేని కృష్ణ]], [[చిరంజీవి]] సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక చిత్రంలో కథానాయకునిగా కూడా నటించాడు.
 
నూతన్ ప్రసాద్ సైతాన్ గా నటించిన [[రాజాధిరాజు]] చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. 1984 లో ''సుందరి సుబ్బారావు'' చిత్రంలో నటనకు ఆయనకు [[నంది పురస్కారం]] లభించింది. 2005 లో ఎన్టీఆర్ పురస్కారం లభించింది. 'బామ్మమాట బంగారుబాట' చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కొంతకాలం నటజీవితామనికి దూరంగా ఉన్నా తిరిగి కోలుకుని నటించడం మొదలెట్టారు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలిగాడు. ‘దేశం చాలా క్లిష్టపరిస్థితిలో ఉంది’ ‘నూటొక్క జిల్లాల అందగాడిని’ అనే డైలాగులు ప్రేక్షకాదరణ పొందాయ. ఎన్ని వైవిధ్యమైన పాత్రలు, ఏ ప్రాత పోషించినా ప్రాణం పోసేవాడు. ముఖ్యంగా ప్రసాద్‌లో ధారణశక్తి గొప్పది. ఎంత పెద్ద డైలాగ్‌ చెప్పినా ఒకే టేక్‌లో 1200 అడుగులు షాట్‌ ఒకే చేసి ఆ రోజుల్లో సంచలనం సృష్టించాడు. అప్పటికీ ప్రసాద్‌ కొత్త తరం నటుడే అయినా పాతతరం పోకడల్ని తూ.చ. తప్పకుండా అనుసరించేవాడు. దర్శకుల మనోభావాలను అర్ధం చేసుకొని ఎంతటి క్లిష్టమైనా సన్నివేశానికైనా జవసత్వాలు నింపి ఆ సన్నివేశాన్ని పండించేవాడు. అందరిలో కలుపుగోలు తనంగా వుంటూ ముఖ్యంగా సంభాషణల్లో తనలో ఉన్న నటుడ్ని ఆవిష్కరించేవాడు<ref>[http://www.visalaandhra.com/minitalkies/article-79060 'నూటొక్క జిల్లాల అందగాడు' నూతన్‌ ప్రసాద్‌]</ref> ప్రసాద్ దాదాపు 365 సినిమాల్లో నటించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.<ref name="bhumi">[http://archives.andhrabhoomi.net/state/nutan-prasad-kannumuta-214 నూతన్ ప్రసాద్ కన్నుమూత]</ref>
 
కొద్ది రోజులు [[రవీంద్ర భారతి]] కి ఇన్‌ఛార్జ్ గా ఉన్నాడు. వ్యక్తిగతంగా [[తెలుగుదేశం పార్టీ]] అభిమాని.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/65377.html</ref>
"https://te.wikipedia.org/wiki/నూతన్_ప్రసాద్" నుండి వెలికితీశారు