పండరిభజనలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
 
==;పండరి భజనలు:==
ఇది కళారూపం మహారాష్ట్రానిది. పండరి పురంలోని పాందు రంగని వేడుకుంటూ చేసే నృత్యం. పండరి భక్తుల ద్వారా దేశమంతటా వ్వాపించింది. ఇది నృత్య ప్రధానమైన భజన. చేతిలో చిరుతలు, నోటితో పాట, పాటకు తగిన అభినయం. ప్రాముఖ్యం వహించే వాయిద్యాలు డోలక్ .. మద్దెల, కంజిరా, తంబూరా, తాళాలూ, హర్మోనియం మొదలైన వాయిద్యాలతో కూడిన పండరి భజన ఎంతో ఇంఫుగానూ సొంపుగానూ వుంటుంది.
 
;అందరి భజన:
 
పండరి భజనల్లో అన్ని తెగల వారూ పాల్గొంటారు. వీరికి గురువు వుంటాడు. ఇతడు పల్లెలు తిరుగుతూ పండరి భజనలు నేర్పుతూ పొట్ట పోసుకుంటాడు. ఈ భజనలు ఒక ప్రాంతమని కాక ఆంధ్ర దేశంలో చాల చోట్ల చేస్తారు. ఈ భజనలు రాయల సీమ ప్రాంతంలో ఎక్కువతా జరుగుతాయి.
ఈ నృత్యంలో చిన్న పిల్లలే ఎక్కువగా పాల్గొంటారు. పిల్లలకు కాషాయ గుడ్డను నడుముకు కట్టించి, పశుపు పచ్చని జెండాను మూరెడు పొడవు కట్టెకు కట్టించి కుడి చేతిలో పట్టిస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్టి బాల బాలికలు సుమారు ఎరవై మంది దాకా పాల్గొంటారు. గురువు మధ్యలో వుంటూ ఒక్కొక్క భంగిమను చూపిస్తూ వుండగా, చుట్టూ పిల్లలు వృత్తాకారంలో నిలబడి అదే భంగిమను అభినయిస్తారు.
ప్రప్రథమంగా గురువు తాళాన్ని ఇలా ప్రారంభిస్తాడు. తక..తక..త .. తక తక ....తక.. తకిట.. తా... కిట.... తకిట... తకిట ... తకిట.... తరువాత పిల్లలు గురువుకు నమస్కరిస్తారు. నృత్యం ప్రారంభించే ముందు గ్రామంలోని అన్ని దేవతల పేర్5ఉలను చెపుతాడు. అప్పుడు పిల్లలంతా ఇలా జై జై అంటారు. పాండు రంగ స్వామికి జై .... కదిరి నరసిమ్మస్వామికి....... జై గుంతకల్లు కసాపురం ఆంజనేయ స్వామికి.... జై.... అంటూ పేరు పేరునా జై కొట్టిస్తాడు.
 
==; జై, జై విట్టల్:==
తరువాత ఈ విధంగా ప్రారంభిస్తారు.
 
<poem>విట్టల్ విట్టల్ .... జై జై విట్టల్
పాండు రంగ విట్టల్ ... పండరి నాధ విట్టల్
గోవిందం భజగోవిందం
ఆనంద బ్రహ్మానందం.</poem>
పంక్తి 23:
అందమైన బాల భక్తుల భజన చూడండి</poem>
 
ఒక్కొక్క సారి నృత్యంలో పిల్లలంతా గొలుసు ఆకారంలో ఒక్కసారి మెద మీద చేతులు వేసుకుని గుండ్రా కారంగా నిలబడి ఒక్కొక్క కాలిని నేలమీద కొడుతారు. వెనక్కి ముందుకూ వాలుతూ లేస్తూ విన్యాసం చేస్తారు. తాళానికి అనువుగా అడుగుల వేగాన్ని పెంచుతారు.
 
==;గోపికా కృష్ణుల నృత్యం:==
 
గోపికలంగ్తా చేతులను వూపుతూ వయ్యారంగా అడుగులు వేసుకుంటూ, శ్రీకృష్ణుని దగ్గర కెళ్ళి రెండు చేతులెత్తి మ్రొక్కుతూ పాట కనుగుణంగా అభినయిస్తారు. శ్రీ కృష్ణుడు వారి మాటలు పట్టించుకో కుండ తిరుగుతూ వుంటారు.
 
<poem>గొల్లవారి నల్లసామిగా గోపాల కిట్న
యిల్లు యిల్లు తిరగవాకుమా
వారు పోతే దారి కడ్డము పోకుమా
గోపాల కిట్న యిల్లు యిల్లు తిరగమాకుమా.</poem>
 
ఇలా పండరి భజనలో, కృష్ణలీలలు చాల ముఖ్యం. శ్రీ కృష్ణుడు చీరలు దొంగలించడం, గోపికలు భంగ పోవటం, ఇద్దరి మధ్యా సంవాదం నడుస్తుంది. ఇలా ఎన్నో పాటలు కృష్ణునికి సంబందించిన భక్తి పాటలతో భజనలు చేస్తారు.
 
;ముగింపులో మంగళం పాడుతూ నృత్యాన్ని నిలిపి వేస్తారు.
 
ఈ నృత్యంలో హిందీతో కూడిన గేయాన్ని కొందరు పాండు రంగ భక్తులు రచన చేసారు. అంతే గాక క్షేత్రాన్ని చూసి తరించి భక్తి ఆవేశాలతో ఆ పండరి పాండురంగని పై అనేక గేయాలు రచన చేసారు.ఈ పందరి భజనల్ని బాల బాలికలు చేస్తున్నప్పుడు, వారి వేషాలనూ, నృత్యాన్నీ, పాటలనూ వింటున్న ప్రేక్షకులు సంతోషంతో చూస్తూ వుంటారు. కొందరు పూలమాలల్ని వారి మెడల్లో అలంగరిస్తారు. కొందరు రూపాయలిస్తారు. మరి కొందరు ఈలలతో, కేకలతో కేరింతలు కొడతారు. కొంత మంది నేర్పిన గురువు మెడలో పూల మాలలు వేసి కొత్త బట్టలతో సత్కరిస్తారు. ఈ భజనను అనంత పురం జిల్లాలో వ్వాపింప చేసిన వారిలో ధర్మవరానికి చెందిన, ధర్మవరం వెంకట రాముడు ప్రముఖుడు. ఈయన ఆ ప్రాంతపు పలలెల్లో భజనలు నేర్పుతూ ఆడుతూ, పాడుతూ, ఆ దేవ దేవుణ్ణి తలుస్తూ జీవితాన్నీ సాగిస్తున్నాడని డా: చిగిరిచర్ల కృష్ణా రెడ్డి వారి జానపద నృత్య కళలో వివారించారు.
 
 
[[వర్గం:జానపద కళారూపాలు]]
*{{మూలాలజాబితా తెలుగునాట జానపద కళారీతులు: మిక్కిలి నేని రాధాకృష్ణ మూర్తి}}
"https://te.wikipedia.org/wiki/పండరిభజనలు" నుండి వెలికితీశారు