పప్పు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''పప్పు''' లేదా '''పప్పు కూర''' [[ఆంధ్రులు]] ఎంతో ఇష్టంగా [[అన్నం]]లో కలుపుకొని తినే పదార్థం. తెలుగు వారి [[భోజనం]]లో తప్పనిసరిగా ఉండేది పప్పు. పప్పు భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళూ వేర్వేరు రకాలుగా చేస్తారు. వివిధ రకాల పప్పు దినుసులకు ఉడికించి రుచికరమైన [[కూర]]గా తింటారు. రుచి కోసం చాలా రకాల మసాలా, [[కూరగాయలు]] మొదలైన వాటిని చేర్చి అందరికీ నచ్చే విధంగా తయారుచేస్తారు. ఉత్తర హిందుస్థానంలో పప్పు కూరల్ని [[రొట్టె]]లు, [[చపాతీ]]లతో కలిపి తింటారు.
 
శనగలు, మినుములు, రాజ్మా, కందులు, పెసర్ల వంటివి తరచుగా తింటూనే ఉంటాం. ఇలాంటి పప్పుల్లో, చిక్కుడుజాతి గింజల్లో పీచు, ప్రోటీన్లు దండిగా ఉంటాయి. అందువల్ల ఇవి త్వరగా కడుపునిండిన భావన కలిగిస్తాయి. వెంటనే ఆకలి కాకుండా చూస్తాయి. నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలోకి చక్కెర వెంటనే విడుదల కాకుండా చేస్తాయి. అంతేకాదు శరీరానికి బలాన్ని ఇవ్వటంతో పాటు జబ్బులను నివారించుకునే శక్తినీ అందిస్తాయి.
పంక్తి 24:
* [[పాల కూర]] పప్పు
* [[మెంతి కూర]] పప్పు
*[[ఖీమా]] పప్పు
*[[నాటుకోడి]] పప్పు
 
==ఉపయోగాలు==
పంక్తి 33:
* వీటికి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణమూ ఉంది.
==వండే విధానము==
పప్పుని వివిధమైన పాత్రలలో వండుతారు, పప్పు వండే విధానాన్ని బట్టి రుచిలో తేడా ఉంటుంది. పూర్వం [[రాచిప్ప]] (రాతితో చేసిన చిప్ప) లలో పప్పును వండి తినేవారు, ప్రస్తుతం ఎక్కువగా ఉడకడానికని [[కుక్కర్]] లో వండుతున్నారు. సాధారంగా ఉడికిన పప్పుని [[కవ్వం]] గానీ, లేక గట్టి [[గరిటె]]ను గానీ ఉపయోగించి చిదుముతారు దాని వల్ల రుచి ద్విగుణీకృతమవుతుంది.
 
==ప్రాంతాన్ని బట్టి తేడాలు==
"https://te.wikipedia.org/wiki/పప్పు" నుండి వెలికితీశారు