పి.ఎస్.ఆర్. అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

కొంత విస్తరణ
చి Wikipedia python library
పంక్తి 3:
అప్పారావు 1923 జులై 21 వ తేదీన [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[కొవ్వూరు]] తాలూకా, [[బందపురం]]లో జన్మించాడు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను, [[విజయవాడ]] శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలోనూ, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లోను విద్యాభ్యాసం చేశాడు. ’తెలుగు నాటకవికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి 1961 లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించాడు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
 
అప్పారావు వృత్తిరీత్యా అధ్యాపకుడు. [[భీమవరం]], [[రాజమహేంద్రవరం]], [[మద్రాసు]], [[కడప]], శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీల్లోనూ, మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలోనూ కొంతకాలం ఉపస్యాసకుడిగా పనిచేశాడు. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం లోను పాఠ్యగ్రంథ జాతీయకరణ ప్రత్యేకోద్యోగిగా పనిచేశాడు.
 
అప్పారావు 1987 లో కలకత్తాలో జరిగిన విశ్వ ఉన్నయన్ సంసద్లో ''రాష్ట్ర నాట్య సామ్రాట్'' బిరుదును, 1990లో హైదరాబాదు యువ కళావాహిని వారిచే ''నాటక రత్న'' బిరుదాన్ని, 1992 లో శ్రీకాళహస్తి భరతముని ఆర్ట్స్ అకాడెమీ వారిచే ''కళారత్న'' బిరుదాన్ని అందుకున్నాడు.<ref>[http://books.google.com/books?id=QA1V7sICaIwC&pg=PA54&lpg=PA54&dq=ponangi+apparao#v=onepage&q=ponangi%20apparao&f=false Who's who of Indian Writers, 1999: A-M edited by Kartik Chandra Dutt]</ref>