మగ్దూం మొహియుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 1:
[[బొమ్మ:MagdUM mohiyuddIn.jpg|right|250px|thumb|మగ్దూం మొహియుద్దీన్]]
[[బొమ్మ:MagdUM mohiyuddIn text.jpg|right|250px|మగ్దూం మొహియుద్దీన్]]
'''మగ్దూం మొహియుద్దీన్''' ('''Makhdoom Mohiuddin''')
==బాల్యం, విద్యాభ్యాసం==
{{వికీకరణ}}
[[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[మెదక్]] జిల్లా [[ఆందోల్]] లో [[1908]] [[ఫిబ్రవరి 4]] న జన్మించాడు. ఆయన పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియొద్దీన్ ఖాద్రి(మహ్మద్ మగ్దూం మొహియుద్దీన్ హుజ్రీ) . వీరి పూర్వీకులది [[ఉత్తర ప్రదేశ్]] లోని ఆజంగఢ్.ఆయన తాత (తల్లితండ్రి) రషీదుద్దీన్ ఔరంగజేబు సైన్యాలతో పాటు దక్కన్ పీఠభూమికి వచ్చాడు. అలాగే, మరో తాత (తంవూడికి తండ్రి) సయ్యద్ జాఫర్ అలీ కూడా ఉత్తరవూపదేశ్ షాజహానాబాద్ నుండి 1857లోనే దక్షిణానికి వచ్చాడు. ఆ రకంగా ఆ కుంటుంబమంతా హైద్రాబాద్ దక్కన్ పరిసరాలకు చేరింది.
ఉస్మానియా యూనివర్సిటీలో మఖ్దూమ్ (1934-37) హాస్టల్లో ఉండేవాడు.అక్కడ తన తొలి కవిత ‘టూర్’ 1934లో రచించాడు.మఖ్దూమ్, కవిగా, నాటక రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్ షా నాటకానికి ‘హోష్ కె నా ఖూన్’ అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్‌లో రవీంవూదనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించాడు. గురుదేవులు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక, నాటక ప్రదర్శన అయిపోగానే స్టేజిపైకి వెళ్ళి మఖ్దూమ్‌ని అభినందించి, తన శాంతినికేతన్‌కు వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించారు.మఖ్దూమ్ ‘మర్షదే కామిల్’ అనే మరో నాటకం రాశాడు.1937లో మఖ్దూమ్ తన 29వ యేట ఎం.ఎ. డిగ్రీ తీసుకున్నాడు. ‘ఉర్దూ నాటకం’పై ఒక పరిశోధన పత్రం కూడా రాశాడు.హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది.కమ్యూనిస్టు రహస్య పత్రిక ‘నేషనల్ ఫ్రంట్’ సంపాదించి చదివేవాడు. నాగపూర్ కామ్రేడ్ల సహాయంతో 1930-40లలో హైద్రాబాద్‌లో ‘స్టూడెంట్స్ యూనియన్’ ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. చండ్ర రాజేశ్వరరావు, గులాం హైదర్, రాజ బహుదూర్ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి పనిచేస్తుండేవాడు.‘‘రైతుకు రొట్టె నివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని!’’ అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు.
అక్తర్ హుస్సేన్ రాయ్పురి, సిబ్తె హసన్‌లతో కలిసి హైద్రాబాద్‌లో ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపించాడు. సరోజినీ నాయుడు నివాసం (గోల్డెన్ త్రెషోల్డ్)లో [[ఎన్.ఎం.జయసూర్య|డాక్టర్ జయసూర్య]], జె.వి. నర్సింగరావులతో కలిసి సాహిత్య, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలు జరుపుతుండేవాడు. చార్మినార్ సిగట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, అల్విన్, షాబాద్ సిమెంట్, ఎన్ ఎస్సార్ రైల్వే ఎంప్లాయిస్, ఎలక్ట్రిసిటీ, సి.డబ్ల్యు.డి. మున్సిపాలిటీ, బటన్ ఫ్యాక్టరీ వంటి వందల కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్ అధ్యక్షుడయ్యాడు. అహో రాత్రులు వారి సంక్షేమం కోసం కృషి చేశాడు.
పంక్తి 14:
*తన జూనియర్, హాస్టల్ మేట్ ఒకతను ఎప్పుడూ పచ్చ శాలువా కప్పుకుని తిరుగుతూ ఉండేవాడు. ఓ రోజు అతని శాలువాను ఎవరో దొంగిలించారు. అది తెలిసి అతణ్ణి ఆట పట్టించడానికి మఖ్దూమ్ ‘పిలా దుశాల’ అనే పాట రాశాడు. హాస్యోక్తులు చిందిస్తూ, లయబద్దంగా సాగే ఆ పాట హైద్రాబాద్ విద్యార్ధి లోకంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఎప్పుడూ నవ్వుతూ,నవ్విస్తూ సరదాగా,మంచి స్నేహితుడిలా ఉండే మఖ్దూమ్ విద్యార్థులందరికీ ఆత్మీయుడిగా ఉండేవాడు.
*హైద్రాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫూల్‌చంద్ గాంధీ ఆరోగ్యశాఖ మంత్రి.అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన మఖ్దూమ్ ఆ శాఖలోని అవకతవకలు ఎత్తి చూపుతూ ‘‘ఫూల్ చన్ద్ - కాంటే బహుత్’’ (పువ్వులు కొంచెం - ముళ్ళేమో ఎక్కువ) అని చలోక్తి విసిరాడు.ఎంతటి గాఢమైన విషయాన్నైనా సున్నితమైన హాస్యాన్ని జోడించి, టూకీగా చెప్పేవాడు.
*ఆయన జైల్లో ఉన్నప్పుడు అన్నంలో ఒకసారి ఉడికిన తేలు బయటపడింది. ‘‘శాఖాహారులకు ఇలా బలవంతంగా మాంసాహారం వడ్డించడం తగదు’’ అన్నాడు.నాసిరకం కూరలని నిరసిస్తూ
==ఉద్యమాలు,పదవులు,రాజకీయాలు==
మఖ్దూం కార్మిక నాయకుడు,శాసన మండలి సభ్యుడు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకోసం క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. అందరూ కలిసి భోజనం చేసే దస్తర్‌ఖాన్ల గురించి కల గన్నాడు. ప్రగతిశీల భావాలతో
ఢిల్లీలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ సమాఖ్య (ఎ.ఐ.టి.యు.సి.) జాయింట్ సెక్రటరీగా కొంత కాలం ఢిల్లీలో ఉన్నారు.1952-55 మధ్య చైనా, సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు తిరిగి వచ్చాడు. ప్రపంచ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన కార్యాలయం వియాన్నాలో (1953-54) పనిచేశారు.
==సాహిత్యము==
|