వసంతరావు వేంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విజయనగరం జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = వసంతరావు వెంకటరావు
| residence = విజయనగరం
| other_names =
| image =Vasantarao venkatarao.png
| imagesize = 200px
| caption = వసంతరావు వెంకటరావు
| birth_name = వసంతరావు వెంకటరావు
| birth_date = [[1909]], [[ఫిబ్రవరి 21]]
| birth_place =
| native_place =
| death_date = [[1992]], [[ఏప్రిల్ 25]]
| death_place =
| death_cause =
| known = సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి.
| occupation =విజయనగరం మహారాజ కాలేజీ లో భౌతిక శాస్త్ర ఆచార్యులు<br /> ప్రిన్సిపాల్
| title =
పంక్తి 37:
 
 
'''వసంతరావు వెంకటరావు''' ప్రముఖ సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి.
==జీవిత విశేషాలు==
ఈయన [[1909]], [[ఫిబ్రవరి 21]] వ తేదీన జన్మించారు. తండ్రి పేరు తాతారావు. [[విజయనగరం]] మహారాజ కాలేజీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య(ఎం.యస్సీ) చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్త [[సూరి భగవంతం]] వద్ద భౌతిక శాస్త్ర ప్రయోగ శాలలో కొంతకాలం శిక్షన పొందారు. విజయనగరం మహారాజ కాలేజీ లో [[1935]] లో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా చేరి, పదోన్నతులను పొందుతూ ప్రిన్సిపాల్ గా(1956-69) పదవీవిరమణ చేశారు.
 
== రచయితగా==
భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపన్యాసాలు, రచనలు ద్వారా విస్తృత పరిధిలో వ్యాపింపచేశారు. తెలుగులో భౌతిక, రసాయనిక శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను తెలుగు భాషా సమితి తరపున రూపొందించారు. దాదాపు సహస్ర విజ్ఞాన వ్యాసాలు రాసారు. వీటిలో అనేకం వ్యాస సంపుటాలుగా వెలువడినాయి. ఈయన రాసిన సైన్స్ గ్రంథాలు 32 లో కొన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలుగా ఎంపిక అయ్యాయి.
 
మానవ మానవ, పడకటింట్లో విజ్ఞానచర్చ, పారిజాతం మొదలగు అనేక పుస్తక రచనలు జన సామాన్యానికి కూడా విజ్ఞానాన్ని చేకూర్చాయి. తెలుగు అకాడమీ లో, 18 పుస్తకాలు డిగ్రీ విధ్యార్థులకు వెలువరించారు. విద్యార్థి లోకానికి సంబంధించిన భౌతిక శాస్త్ర సంబందమైన అనేక ప్రయోగాలు నిర్వహించారు. సామాన్య శాస్త్రం మీద, మాతృభాష మీద ఈయనకు గల అపార గౌరవాభిమానాలు, జిజ్ఞాసలు తెలుగువారికి వరప్రదాతలయ్యాయి. సైన్స్ ను అతి సరళ మైన తెలుగు భాషలో విస్తృత ప్రచారం చేసిన ఈయన [[1992]], [[ఏప్రిల్ 25]] న మృతి చెందారు.
"https://te.wikipedia.org/wiki/వసంతరావు_వేంకటరావు" నుండి వెలికితీశారు