వై.వి. రావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 2:
'''యెర్రగుడిపాటి వరదరావు''' ('''వై.వి.రావు''') (జ: [[మే 30]], [[1903]] - మ: [[ఫిబ్రవరి 14]], [[1973]]) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు.
 
వై.వి.రావు [[1903]] [[మే 30]]న [[నెల్లూరు]]లో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయములో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో [[బొంబాయి]] వెళ్లాడు. బొంబాయిలో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశము పొందాడు. ఈయన కొన్ని రోజులు [[అర్దేషిర్ ఇరానీ]] యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత మద్రాసులోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన [[ఆర్.ఎస్.ప్రకాష్]] యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు [[1939]] లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన [[చింతామణి పిక్చర్స్]] ను స్థాపించాడు. [[1950]]లో శ్రీవరుణ ఫిలంస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ మరియు దక్షిణ భారత దేశములలోని ప్రముఖ చిత్రనిర్మాణ కేంద్రాలైన బొంబాయి, [[కొల్హాపూర్]], [[మద్రాసు]] మరియు [[మైసూరు]]లలో పనిచేశాడు. తొలి కన్నడ టాకీ చలనచిత్రము, ఎం.వి.సుబ్బయ్య నాయుడు మరియు ఆర్.నాగేంద్రరావు నటించిన ''[[సతీ సులోచన]]'' ఈయనే నిర్మించాడు.
 
[[1946]]లో వై.వి.రావు, నర్తకి నుంగంబాక్కం జానకి కుమార్తె మరియు తమిళ సినిమా నటీమణి అయిన కుమారి [[వై.రుక్మిణి|రుక్మిణి]]ని వివాహమాడినాడు. తెలుగు సినీనటి [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] (''జీన్స్'' చిత్రములో బామ్మ) ఈయన కూతురే.
పంక్తి 18:
*[[సావిత్రి]] (1941)
*[[విశ్వమోహిని]] (1940) (నటుడు, కథా రచయిత మరియు దర్శకుడు)
*[[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్ళీ పెళ్ళి]] (1939) (నటుడు, కథా రచయిత మరియు దర్శకుడు)
*[[భక్త మీరా]] (1938)
*[[స్వర్ణలత]] (1938)
"https://te.wikipedia.org/wiki/వై.వి._రావు" నుండి వెలికితీశారు