శ్రీకృష్ణసత్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 2:
name = శ్రీకృష్ణసత్య |
|year = 1971|
image = Sri Krishna Satya.jpg |
|starring =
[[నందమూరి తారక రామారావు]],
[[జయలలిత]],
[[కాంతారావు]],
[[ఎస్.వి. రంగారావు]],
[[పద్మనాభం]] |
|story =
|screenplay = [[నందమూరి తారక రామారావు]]
|director = [[ కె.వి.రెడ్డి ]]|
|dialogues =
|lyrics = పింగళి నాగేంద్రరావు
|producer = ఎన్. త్రివిక్రమరావు
|distributor =
పంక్తి 18:
|playback_singer = [[ఘంటసాల]],
[[పి.సుశీల]] |
|choreography =
|cinematography =
|editing =
|production_company = ఆర్.కె.బ్రదర్స్
పంక్తి 27:
శ్రీ రామావతారానికి, శ్రీ కృష్ణావతారానికి సంధానం చేస్తూ నిర్మించిన పౌరాణిక చిత్రమిది. పౌరాణిక కథకు కల్పన జోడించి చిత్రకథను రూపొందించారు.
== చిత్రకథ ==
శ్రీరామ రావణ యుధ్దంలో పరాజయం అంచున నిలిచిన రావణుడు, పాతాళ లంకను పాలిస్తున్న మైరావణుని సహాయం కోరతాడు. రామ లక్ష్మణులను కాళికా దేవికి బలి ఇస్తానని మైరావణుడు ప్రతిజ్ఞ చేస్తాడు. చారుల ద్వారా విషయం తెలుసుకున్న హనుమంతుడు రామలక్ష్మణులకు తన తోకతో కోటను నిర్మించి ఆ కోట భాగాన కూర్చొని ఉంటాడు. మైరావణుడు విభీషణుని రూపంలో వచ్చి రామ లక్ష్మణులను బొమ్మలుగా మార్చి తీసుకుపోతాడు. హనుమంతుడు మోసం తెలిసిన పిమ్మట పాతాళ లంకు వెళ్తాడు. శ్రీరాముని భర్తగా కోరుకున్న చంద్రసేన మైరావణుని బందీగా ఉంటుంది. మైరావణుని వధించడానికి అతని ప్రాణ రహస్యం తెలుసుకోవలసి ఉంటుంది. అందుకు చంద్రసేన సహాయం అర్ధిస్తాడు హనుమంతుడు. అందుకు ప్రతిగా చంద్రసేన నీ స్వామి నాస్వామి కావాలని కోరుతుంది. అందులో అంతరార్ధం తెలియని హనుమంతుడు అలాగే అని మాట ఇస్తాడు. మైరావణుని వధ తరువాత చంద్రసేన కోరిక తెలిసిన శ్రీరాముడు విస్తుపోతాడు. చంద్రసేన కోరిక లో పరమార్ధం తనను భర్తగా పొందడమని ఏకపత్నీ వత్రుడైన తాను ఆ కోరికను తీర్చడం అసాధ్యమని తెలుపుతాడు. ఐతే హనుమంతుని మాట నిలబెట్టడానికి చంద్రసేన భవనానికి వస్తాడు. హనుమంతుడు కీటక రూపంలో దుశ్సకనం వస్తాడు. శ్రీరాముడు శయ్య మీద కూర్చొనగానే మంచం విరుగుతుంది. చంద్రసేన ఈ దుశ్చర్య కు కారణమైన వానిని శపించబోగా హనుమంతుడు శరణాగతుడై, ప్రతక్షమై, శ్రీరామ ఏకపత్నీ వత్రాన్ని వివరించి వచ్చు జన్మలో ఆమెను భర్తగా స్వకరిస్తాడని చెబుతాడు.

ద్వాపర యుగంలో శ్రీ కృష్ణావతర కాలంలో చంద్రసేన సత్యభామగా జన్మస్తుంది. శ్రీకృష్ణునిపై అకారణ ద్వేషం పెంచుకుంటుంది. సత్యభామకు పూర్వజన్న జ్ఞాపకం చేసి తనవశం చేసుకుంటాడు శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణుడు తనకే స్వంతమై ఉండాలని సత్యభామ పంతం. రుక్మిణి పుట్టిన రోజని శ్రీకృష్ణుడు ఆమె మందిరానికి వెళ్లినాడని సత్యభామ కినుక వహిస్తుంది. నారదుడు, శ్రీకృష్ణుని వశపరచుకొనుటకు పుణ్యక వ్రతమాచరించమని అందులో భాగముగా శ్రీ కృష్ణుని తనకు దానమిమ్మని సత్యభామకు సూచిస్తాడు. సత్యభామ అలకను శ్రీ కృష్ణుడు తీర్చువేళ నారదుని సూచించిన పుణ్యక వ్రత వృత్తాంతాన్ని చెబుతుంది. సత్యభామ ముచ్చట తీర్చడానికి శ్రీకృష్ణుడంగీకరిస్తాడు. వ్రత విధానమైన పిమ్మట శ్రీకృష్ణుని దానం పొందిన నారదుడు, శ్రీ కృష్ణుని తూచదగ్గ ధనధనేతరములు సత్యభామ వద్ద లేక పోవుటచే శ్రీకృష్ణుని అమ్మజూపుతాడు. రుక్మిణి తులసిదళంతో శ్రీకృష్ణుని తూచుటతో సత్యభామకు అహంకారం నశిస్తుంది. శ్రీ కృష్ణుడు హస్తినకు పాండవదూతగా వెళ్లి రాయబారం నెఱపుతాడు.పాండవులకు సూది మొన మోపిన భూమిని కూడా ఇయ్యనని దుర్యోధనుడు పట్టు దలగా ఉండాడు. రాయబారం విఫలమవుతుంది. పాండవ కౌరవుల యుధ్దమనివార్యమవుతుంది. కౌరవసేనను చూసి తల్లడిల్లిన అర్జునునకు గీతోపదేశం చేస్తాడు గోవిందుడు. గీతోపదేశంతో చిత్రం ముగుస్తుంది.

కథలో నవ్యత ఉందనిపించినా కథ అతుకుల బొంతలా తోస్తుంది. సన్నివేశాలు వేటికవే బాగున్నా సన్నివేశాలను మిళితం చేసే సూత్రం (కంటిన్యూటి) లోపిస్తుంది. ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, కాంతారావు వంటి ఉద్ధండులు గొప్పగా నటించడంతో మంచి సినిమా చూసేమనే తృప్తి కలుగుతుంది.

==పాటలు==
పంక్తి 76:
{{మూలాలజాబితా}}

* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

* సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణసత్య" నుండి వెలికితీశారు