ప్రధాన మెనూను తెరువు

మీ వైఖరిసవరించు

మీ వైఖరి మార్చుకొని తిరిగి వికీపీడియాలో రాస్తున్నారు. అభినందనలు... పంతాలకు.. పట్టింపులకు పోకుండా ఉండండి.-- రాముడు

రాముడు గారు, మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మీకు నాగురించి తెలిసినవారయి ఉండవచ్చును. ముఖ్యంగా నేను మీకు తెలియజేయునది ఏమనగా, నావైఖరి మార్చుకొని వ్రాస్తున్నాను అని, పంతాలకు పట్టింపులకు పోతున్నానని మీరు అనుకుని నాకు సందేశం వ్రాసారు. కానీ, నేను వికీపీడియాలో ఎప్పుడూ వ్రాస్తునే ఉన్నాను, ఈ మధ్య నా వ్యక్తి గత ఆరోగ్య అవసరాల దృష్ట్యా అతి ఎక్కువ సమయం ఇక్కడ కేటాయించలేదు. నాకు ఎటువంటి పంతాలు పట్టింపులు లేవండి. నేను చాలా ప్రశాంత మనసుతో ఉన్నాను. మీ సందేశానికి ధన్యవాదములు తెలుపుతూ, మీ మనసులో ఉన్న నాగురించి వ్రాయండి, తప్పకుండా జవాబు వ్రాస్తాను.JVRKPRASAD (చర్చ) 13:44, 27 డిసెంబరు 2018 (UTC)
ప్రసాద్ గారూ మీ ఫోన్ నెంబరు మారినదా? ఇదివరకు మీరిచ్చిన నెంబరు సర్వీసులు నిలిపివేయబడినట్లు సమాచారంవచ్చుచున్నది. కొత్తనెంబరు తెలియజేయగలరు.--కె.వెంకటరమణచర్చ 13:50, 20 జనవరి 2019 (UTC)
కె.వెంకటరమణ గారు, నమస్కారము. నా పాత నంబరు టాటా సర్వీస్ ప్రొవైడర్ నుండి బిఎస్‌ఎన్‌ఎల్ నకు మారాను. టాటా నా ఫోన్ నర్వీస్ బ్లాక్ చేశారు, నేను బాకీ ఏమీ లేను. కారణము తెలియదండి. నేను మరో నంబరు 8333011899 అనేది మరొకటి తీసుకుని వాడుతున్నాను. ఇది నా కొత్త నంబరు దయచేసి నా స్నేహితులు, వాడుకరులు అందరూ గమనించ గలరు. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 14:26, 20 జనవరి 2019 (UTC)

మూలాలు లేని వ్యాసాలు గుర్తింపుసవరించు

ప్రసాద్ గారూ, మూలాలు లేని వ్యాసాలు గుర్తిస్తున్నారు. బాగుంది. కానీ వెనువెంటనే మీ సంతకం చేస్తున్నారు. అలా చేయకూడదు. సంతకం కేవలం చర్చా పేజీల్లోనే చేస్తారు. దయచేసి అలా చేయడం ఆపండి. రవిచంద్ర (చర్చ) 13:20, 24 జనవరి 2019 (UTC)

రవిచంద్ర గారు, మూస ఎవరు పెట్టారో తెలియడం కోసం పెట్టాను. కానీ తెవికీ ప్రస్తుత నియమం ప్రకారం, సూచనలు అనుసరించి పెట్ట కూడదని మర్చి పోయాను. ఇకముందు ఎప్పుడూ నా సంతకం మూసలలో చేర్చను. దయచేసి ఇకముందు కూడా నాకు తెలియనివి తెలియజేయండి. మీరు ఇచ్చిన సలహాకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 13:23, 24 జనవరి 2019 (UTC)
Thanks for the following my advice. దయచేసి ఇప్పటి దాకా వ్యాసాలలో చేసిన సంతకాలు తొలగించగలరు. రవిచంద్ర (చర్చ) 13:27, 24 జనవరి 2019 (UTC)
అదే పని చేస్తునానండి. సంతకాలతో ఉన్నవి అన్నీ తొలగిస్తాను.JVRKPRASAD (చర్చ) 13:28, 24 జనవరి 2019 (UTC)
JVRKPRASAD గారూ, మీరు ఇటువంటి మూసలు పెట్టడమే కానీ ఎవరు స్పందిస్తున్నారు? తొలగింపు మూసలపై వెంటనే స్పందించి తొలగిస్తారు. విషయం చేర్చే మూసలపై ఎవరూ ముందుకు రాని పరిస్థితి. వికీకరణ, శుద్ధి, అనువాదం, మూలాలు సమీక్షించండి, విలీనం, విస్తరణ మొదలైన మూసలు పెట్టినా అటువంటి కార్యక్రమాలపై గల శ్రద్ద నేను వికీలోకి వచ్చినప్పటి నుండి ఎక్కడా కనబడటం లేదు. ఇటువంటి మూసలు పెడతారు మంచిదే కానీ మనం కాక ఎవరు మూలాలు చేరుస్తారు చెప్పండి. కొత్తవారు ఇటువంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టరు. సీనియర్ వాడుకరులు, అనుభవజ్ఞులు ఇటువంటి కార్యక్రమాలపై దృష్టి పెడితే వికీపీడియా ఉన్నతంగా తయారవుతుంది. కానీ అలా జరగడం లేదు. మీవంటి భాషా ప్రేమికులు వర్గం:శుద్ధి చేయవలసిన వ్యాసములు వర్గంలో గల వ్యాసాలను శుద్ధి చేస్తే మంచి వ్యాసాలు తయారవుతాయని నా అభిప్రాయం.--కె.వెంకటరమణచర్చ 13:39, 24 జనవరి 2019 (UTC)
కె.వెంకటరమణ గారు, ముందుగా మీకు ధన్యవాదములు. మీ సలహా, సూచనలు తప్పకుండా పాటిస్తాను. మూసలు పెడితే కనీసం అధికారులు, నిర్వాహకులు ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమోననే ఆశతో వివిధ మూసలు పెడుతున్నాను. ఇటువంటి వ్యాసాలు అన్నీ ఒక వర్గంగా వస్తాయని ఒక ఆలోచన. నా అభిప్రాయం ప్రకారం చాలా తొలగించాల్సినవి ఉన్నాయి. విక్షనరీకి కూడా మార్చవలసినవి ఉన్నాయి. ఇటువంటి వాటిని కొంతకాలం హైడ్ (కనపడకుండా ఒక మూలకు చేర్చటం) చేసే అవకాశం ఉంటే చేయవచ్చును. ఇప్పుడు మీరు చెప్పిన శుద్ధి చేయవలసిన వ్యాసములు కూడా ఒకసారి చూస్తాను. ఈ సందర్భంలో ఒక నిర్వాహకుడు చేయవలసిన పనులలో, ఇప్పుడు తెవికీలో నేనున్న స్థితి, పరిస్థితులలో, నేనేమైనా చేయగలిగిన పనులు ఏమైనా ఉంటే నాకు భవిష్యత్తులో ఒక నిర్వాహకునిగా మీ అందరిచే నియమించబడే అవకాశం ఉన్న పనులు దయచేసి మీరు సూచించండి. తప్పకుండా చేస్తాను. JVRKPRASAD (చర్చ) 13:48, 24 జనవరి 2019 (UTC)

వర్గాలు మార్పు పరిశీలన గురించిసవరించు

ప్రసాద్ గారూ ఈ చర్చా పేజీలు గమనించగలరు. వర్గం చర్చ:వరంగల్ జిల్లా రైల్వేస్టేషన్లు, చర్చ:డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషను

చర్చ:మల్కాజ్‌గిరి రైల్వే స్టేషను. ఇంకా తెలంగాణ జిల్లాల పునర్య్వస్థీకరణ వలన కొన్ని వర్గాలు మార్పు చేయవలసి ఉండవచ్చు --యర్రా రామారావు (చర్చ) 06:05, 28 జనవరి 2019 (UTC)

యర్రా రామారావు గారు, నేను నిన్న మీరు సూచించినవి చూసాను. రమణ, (నిర్వాహకులు) గారు వ్రాసినవి, వారు అందుబాటులోనే ఉన్నారు కనుక నేను మార్పులు చేయలేదు. నన్ను చేయమంటే చేస్తాను. JVRKPRASAD (చర్చ) 06:12, 28 జనవరి 2019 (UTC)
కె.వెంకటరమణ గారు, ఒకసారి పైన రామరావు గారు సూచించిన పేజీలను చూసి సరి చేయగలరు. నన్ను చేయమన్నా చేస్తాను. మీ స్పందన తెలియజేయండి.JVRKPRASAD (చర్చ) 06:20, 28 జనవరి 2019 (UTC)
యర్రా రామారావు గారు, తెవికీలోని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గురించిన వ్యాసం/సమాచారం యొక్క లింకులు దయచేసి ఇవ్వండి. మిగతావి సరిచేసాను.JVRKPRASAD (చర్చ) 23:45, 30 జనవరి 2019 (UTC)
ప్రసాద్ గారూ మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా లింకు ఇచ్చాను.--యర్రా రామారావు (చర్చ) 02:16, 31 జనవరి 2019 (UTC)
మీరు ఇచ్చినది మేడ్చల్ జిల్లా కదండి. మీరు సూచించిన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గురించి నాకు అర్థం కావడం లేదు. మేడ్చల్ జిల్లా అనేది మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాగా మారిందా ? అదే నిజమైతే ప్రధాన పేజీ మార్పు చేయమంటారా ? దయచేసి వివరించండి. JVRKPRASAD (చర్చ) 02:39, 31 జనవరి 2019 (UTC)
వ్యాసం మొదటి పేరా చూడండి.జిల్లా పరిపాలనా కేంద్రం మల్కాజ్‌గిరి.మల్కాజ్‌గిరి మండలం కూడా ఆజిల్లాకు చెందినదే.పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 03:13, 31 జనవరి 2019 (UTC)
కె.వెంకటరమణ గారు, ఈ పై విషయాలను పరిశీలించి, దయచేసి నాకు అర్థమయ్యే విధంగా తెలియజేయండి. యర్రా రామారావు గారు చెప్పేది అర్థం కావడం లేదు. నేను మండలాలు, మండల కేందాలు గురించి కాదండి ఈ చర్చ. కేవలం తెలంగాణా కొత్త జిల్లాలు, పాత జిల్లాల విలీనం వివరాలు గురించిన చర్చ మాత్రమేనండి. రంగారెడ్డి జిల్లా అనేది అసలు ఉందా లేదా అనేది సందేహం. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా అనేది కొత్తగా ఏర్పాటు అయ్యిందా ? ఈ కొత్తగా ఏర్పడిన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కు మేడ్చల్ జిల్లాకు గల సంబంధం గురించి కాదు నా సందేహం. రంగారెడ్డి జిల్లా, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మరియు మేడ్చల్ జిల్లా ఈ మూడింటి గురించి అర్థవంతంగా వివరించండి.JVRKPRASAD (చర్చ) 04:18, 31 జనవరి 2019 (UTC)
ప్రసాద్ గారూ పునర్య్వస్థీకరణలో రంగారెడ్డి జిల్లా మూడు (రంగారెడ్డి జిల్లా, వికారాబాదు జిల్లా, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా) జిల్లాలుగా విడిపోయింది. మేడ్చల్ జిల్లాకు మల్కాజ్‌గిరి పరిపాలన కేంధ్రం. అందువలన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా అంటారు.రంగారెడ్డి జిల్లా వికీపీడియాలో ఉందో లేదో మీరు ఒకసారి దయవుంచి పరిశీలించండి--యర్రా రామారావు (చర్చ) 04:33, 31 జనవరి 2019 (UTC)
కొత్త జిల్లాలు ఏర్పాటు తదుపరి నేను తెలంగాణా మీద దృష్టి పెట్టలేదు. అంతకు ముందు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా (పాత జిల్లాలు) మీద గ్రామ వ్యాసాలు చాలా కాలం చేసాను. ఎడతెరుపు లేని ఒకే వ్యాసాలు దిద్దుబాట్లు, ఎన్ని సంవత్సరాలు ఎంతమంది చేసినా అవి ఒక దారికి రాకపోగా తలంగాణా కొత్త జిల్లాలతో చేసిన పని మొత్తం మళ్ళీ మొదటికి వచ్చినట్లు ఈ కార్యక్రమం మరింత జటిలం అయ్యిందన్న ఉద్దేశ్యంతో, కొద్దిమంది చేతుల మీద ఒకదారికి ఈ ప్రాజెక్టు రావచ్చునన్న నా సొంత అభిప్రాయము మేరకు ప్రస్తుతము నేను చెప్పుకోదగ్గ విధంగా పాల్గొనుట లేదండి. పనిచేసే వారికి తెవికీలో కావల్సినంత పని ఉంది. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 04:40, 31 జనవరి 2019 (UTC)

ఆన్ లైన్ తరగతిసవరించు

ఆన్ లైన్ తరగతి 10 ఫిబ్రవరి ఉదయం 10.30 నుంచి 12 వరకు జరగనుంది. గమనించగలరు. మిగిలిన వివరాలు రేపు తెలియజేయగలను. --పవన్ సంతోష్ (చర్చ) 16:53, 8 ఫిబ్రవరి 2019 (UTC)

మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 21:39, 8 ఫిబ్రవరి 2019 (UTC)

మొదటి ఆన్ లైన్ తరగతి: శుద్ధి చేయాల్సిన వ్యాసంసవరించు

మొదటి ఆన్ లైన్ తరగతిలో 2019 ఫిబ్రవరి 10 తేదీన మీరు పాల్గొన్నందుకు ముందస్తుగా అభినందనలు. అప్పుడు నిర్ణయించుకునన్న విధంగా సురేఖ వ్యాసాన్ని పరిశీలించి, దిద్దమని సూచిస్తున్నాను. ప్రధానంగా వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అన్న రెండు సూత్రాలను ఈ వ్యాసంలోని ప్రతీ వాక్యంలోనూ ఎలా ప్రతిఫలిస్తున్నాయో పరిశీలించండి. సరిగా లేనిచోట్ల మీరే సరిదిద్దండి. ఆపైన పూర్తయ్యాకా నన్ను పింగ్ చేస్తూ చర్చ:సురేఖ పేజీలో కానీ, ఇక్కడే కానీ రాస్తే నేను పున:పరిశీలన చేసి మీకు సహాయం అందిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:20, 12 ఫిబ్రవరి 2019 (UTC)

తప్పకుండా సరిచేస్తాను. నేను ఈ వారంలో (13 &14, 15) నా తమ్ముని కుమార్తె వివాహం తదుపరి ఈ పని చేస్తాను. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 14:48, 12 ఫిబ్రవరి 2019 (UTC)

బ్నింసవరించు

నమస్కారం ప్రసాద్ గారు. నేను ఈ చర్చా పేజీ https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:Vmudunuru/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2 గురించి అడగాలి. ఇది పూర్తి చెయ్యాలంటే యెలాగో చెప్పగలరు.

వెంకట్

మీకు నేను email పంపించాను.సవరించు

నమస్కారం JVRKPRASAD గారు.

నేను మీకు ఒక email పంపించాను. దయచేసి చూసి ప్రత్యుత్తరం ఇవ్వగలరు.

ధన్యవాదాలు.

నమస్కారము. మీరు ఎవరో తెలియదు. మీరు email పంపిన విషయము ఏమిటో తెలియదు. వివరాలు చెప్పండి.JVRKPRASAD (చర్చ) 14:39, 5 జూలై 2019 (UTC)

రైల్వే అనువాదవ్యాసాల గుర్తింపుసవరించు

  చురుకైన అనువాదకులు
భారతీయ రైల్వేకు సంబంధించిన పెక్కు వ్యాసాలను అనువాదం చేసినందుకు గుర్తింపు.--అర్జున (చర్చ) 04:21, 3 ఆగస్టు 2019 (UTC)

Project Tiger 2.0సవరించు

Sorry for writing this message in English - feel free to help us translating it

Return to the user page of "JVRKPRASAD".