సుమతీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

+{{తెలంగాణ సాహిత్యం}}
చి Wikipedia python library
పంక్తి 1:
[[ఫైలు:Telugu sumathisatakam1.GIF|right|thumb|250px| http://www.avkf.org/BookLink/book_link_index.php]]
సుమతీ శతకం పూర్తి పాఠం వికీసోర్స్‌లో రెండు భాగాలుగా ఉన్నది. చూడగలరు
[[:s:సుమతీ శతకము - మొదటిభాగం]]
[[:s:సుమతీ శతకము - రెండవభాగం]]
 
[[తెలుగు సాహిత్యం]]లో [[శతక సాహిత్యం|శతకాలకు]] ఒక ప్రత్యేక స్థానము ఉన్నది. బహుజన ప్రియమైన శతాకాలలో '''సుమతీ శతకం''' (sumathi Satakam) ఒకటి. ఇది [[బద్దెన]] అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పదాలు తెలియని తెలుగువారు అరుదు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను [[సామెతలు]] లేదా [[జాతీయములు]]గా పరిగణించ వచ్చును.
పంక్తి 18:
 
<poem>
శ్లో: కార్యేషుదాసీ కరణేషు మంత్రీ
రూపేచలక్ష్మీ క్షమయా ధరిత్రీ
భోజ్యేషు మాతా శయనేషు రంభా
షడ్ధర్మయుక్తా కులధర్మపత్నీ
 
పంక్తి 49:
సుమతీ శతకంలోని పద్యాలు [[కందం]] [[ఛందస్సు]]లో, "సుమతీ" అనే మకుటంతో ఉన్నాయి. చిన్న పద్యాలు గనుక గుర్తుంచుకోవడం చాలా సులభం. సుమతీ శతకంలో వాడిన భాష ఎంతో సరళమైనది. విన సొంపైనది. పెద్ద పెద్ద [[సమాసాలు]] గానీ, సంస్కృత పదాలు గానీ ఉండవు. కానీ పద్యాలు రాగ యుక్తంగా, జల జల పారే ఏటి వరవడిని కలిగి ఉంటాయి. షుమారు ఏడు వందల ఏళ్ళ క్రితం వ్రాయబడినా దాదాపు అన్ని పదాలూ ఇప్పటి భాషలోనూ వాడుకలో ఉన్నాయి. ఇది పాతకాలం కవిత్వమని అసలు అనిపించదు. పండితులకు మాత్రమయ్యే పరిమితమైన భాష కాదు. పెద్దగా కష్ట పడకుండానే గుర్తు పెట్టుకొనే శక్తి ఈ పద్యాలలోని పదాలలోనూ, వాటిని కూర్చిన శైలిలోనూ అంతర్లీనమై ఉంది. అందుకే చదవడం రానివాళ్ళు కూడా సుమతీ శతకంలోని పద్యాలను ధారాళంగా ఉదాహరించగలిగారు.
 
సుమతి శతకమున పద్యములన్నియు కారాది క్రమమున వున్నవి. ఈ విధానానికి సుమతి శతక కర్థ బద్దెన యే ప్రారంబకుడు. ఇతనిననుసరించి ఆ తర్వాతి కాలములలో భాస్కర శతకము, వేణుగోపాల శతక కర్థలు కూడ సుమతి శతకాన్ని అనుసరించారు.
 
పూర్తి పద్యం రానివారు కూడా ఒకటి రెండు పాదాలను ఉట్టంకించడం తరచు జరుగుతుంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు
పంక్తి 67:
ఇందులో పద్యాలు అందరి నోటా నానడం వలన ఈ శతకం వ్రాతపతులు పరిరక్షింపబడలేదు. కనుక మధ్యమధ్యలో ఇతరులు జొప్పించిన పద్యాలు, పదాలు కలిసిపోయాయి. ("చీటికి ప్రాణము వ్రాలు" అనేది "కుంఫిణీ యుగం" కాలంలో పుట్టిన పద్యం / పదం కావచ్చును. "వైదీకి", "రొక్కము" అనే పదాలు అంత ప్రాతకాలం వాడుకలు కాకపోవచ్చును). అయినా ఎక్కువ పద్యాలకు పెద్దగా పాఠాంతరాలు లేవు. కనుక పద్యాలను స్థూలంగా పరిశీలిస్తే ఆనాటి జీవన గతి, సమాజ స్థితి మనకు గోచరిస్తుంది.
 
దేశం (తెలుగునాడు) చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది. రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. సమాజంలోని ఇబ్బందులనూ, పేదరికాన్నీ ఆసరాగా చూచుకొని కొందరు మిగిలినవారిని పీడించేవారు. సామాన్య స్త్రీలలో [[విద్య]] అతి స్వల్పం. [[పడుపు వృత్తి]] విస్తృతంగా ఉంది. [[సాని]] వారి వెంటబడి తమ సంసారాలను గుల్ల చేసుకొనేవారు పుష్కలంగా ఉన్నారు.[[ వివాహేతర సంబంధాలు]] , వివాహానికి ముందు సంబంధాలు ఉండకపోలేదు. రాజుగారి బంటులు, [[కరణాలు]] దండిగా అధికారాన్ని చలాయించేవారు. డబ్బుకు అప్పుడూ పెద్ద పీటే. ఉద్యోగులకు లంచాలిస్తే పని జరిగేది. ప్రజలు అప్పులు, వడ్డీల ఊబిలో కూరుకుపోవడం జరుగుతుండేది. అల్లుళ్ళు అత్తమామల ఆస్తులను పిండేయడం అప్పుడూ జరిగేది.
 
 
కాని ఎక్కువ మంది సామాన్య జనులు సత్ప్రవర్తనకు, సత్యానికి, ధర్మానికి విలువనిచ్చేవారు. ఇల్లాలిని సంతోషింప జేయడం గృహస్తుని కర్తవ్యం. మాట, మర్యాద నిత్య వ్యవహారంలో చాలా ముఖ్యం. బాల్య వివాహాలు అప్పటికి లేనట్లనిపిస్తాయి (ఇది తరువాత ప్రబలిన [[దురాచారం]] కావచ్చును). రాజులు, మంత్రులు, గ్రామాధికారులు న్యాయానికి, చట్టానికి బాగా ప్రాముఖ్యతనిచ్చారు. కనుక సమాజం అల్లకల్లోలంగా లేదు. అంత పేదరికం ఉన్నట్లనిపించదు. సంపన్నుల ప్రస్తావన తరచు వస్తుంది. ఏనుగులు, గుర్రాలు, ఇతర జంతువులు వూళ్ళలో తరచు కనిపించే జంతువులు.
 
 
జనంలో '[[రసికత]] 'కు మంచి ప్రాముఖ్యత ఉంది. బహువిధాలైన శృంగారాల ప్రస్తావన ఉంది. (అన్నీ పిల్లలకు సంబంధించిన [[నీతులు]] కాదు. "[[పెద్దలకు మాత్రమే]] " అనదగిన పద్యాలు చాలా ఉన్నాయి)
 
== కొన్ని అధిక్షేపింపదగిన విషయాలు ==
"https://te.wikipedia.org/wiki/సుమతీ_శతకము" నుండి వెలికితీశారు