హన్సిక మోత్వానీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె నటుడు
|name = హన్సికా మోట్వాని
|caption =
|image = Star Hansika.jpg
|imagesize = 210px
|birthdate = {{birth date and age|mf=yes|1991|08|09}}
|location = [[ముంబాయి]],[[మహారాష్ట్ర]]
|birthname = హన్సికా ప్రదీప్ మోత్వాని
|homepage =
పంక్తి 26:
* 'జయీభవ'తో కల్యాణ్‌రామ్‌తో జతకట్టినా ఆ చిత్రం వూహించిన అంచనాలను చేరుకోలేకపోయింది. తర్వాత నితిన్‌తో 'సీతారాముల కల్యాణం'లో నటించింది. అది కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దాంతోతన దృష్టిని తమిళ పరిశ్రమ వైపు మళ్లించింది.
* అలా 2011లో 'మాప్పిళ్త్లె' సినిమాతో తమిళంలో బోణీ కొట్టినా విజయం మాత్రం దక్కలేదు. అయినా వెనుకడుగేయకుండా హిట్ కోసం పట్టు బట్టి మరీ తమిళంలో సినిమాలు చేస్తూనే వచ్చింది.
* తమిళంలో విజయ్ సరసన నటించిన 'వెలాయుధం' సినిమాతో విజయాన్ని అందుకుంది.
* అటు తమిళంలో సినిమాలు చేస్తూనే ఇటు తెలుగు సినిమాల పైనా దృష్టి సారించింది. 'కందిరీగ', 'ఓ మై ఫ్రెండ్', 'దేనికైనా రెడీ..', 'సమ్‌థింగ్.. సమ్‌థింగ్..' వంటి సినిమాలతో తెలుగు ప్రజల్ని పలకరిస్తూ.. హిట్‌లను తన ఖాతాలో జమ చేసుకుంది.
* కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా 'ఆప్ కా సరూర్' సినిమాతో ఈ అమ్మడి లక్‌ని పరీక్షించుకుంది. అక్కడ కూడా హిట్ కొట్టడంతో 'మనీ హై తో హనీ హై' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.
* తన అందంతో ఎందరో కుర్రకారు మనసుల్ని ఉర్రూతలూగించిన హన్సిక తను శింభుకే సొంతమని అప్పట్లో ఓపెన్‌గా చెప్పేసింది. తమ గురించి హల్‌చల్ చేస్తున్న పుకార్లన్నిటికీ 'మేం లవ్‌లో ఉన్నమాట నిజమే' అంటూ ఫుల్‌స్టాప్ పెట్టేసిందీ జంట. కానీ, ఆ బంధం కాస్తా బెడిసికొట్టడంతో.. నా దృష్టంతా కెరీర్‌పైనే అని ప్రకటించింది.
* కేవలం నటన పరంగానే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా కూడా హన్సికని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి పుట్టిన రోజుకీ ఒక అనాథ అమ్మాయి లేదా అబ్బాయిని దత్తత తీసుకుని ఆదరిస్తుందట! అలా ఈమె దత్తత తీసుకున్న పిల్లల సంఖ్య 20కి పైగానే ఉంటుంది.
* ఈమె కు పాలంటే అస్సలు నచ్చవట. ఏ మాత్రం తీరిక దొరికినా వంట చేయడానికి ఆసక్తి చూపిస్తుందట! అలాగే ప్రయాణం చేస్తూ లోకమంతా చుట్టిరావడమంటే చాలా ఇష్టమట. ఇంట్లో ఆమెకున్న పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ తన బ్రదరే అంటూ కితాబిచ్చేస్తోంది.
* 2013లో విడుదలైన సింగం-2లో నటనకుగాను అందరి ప్రశంసలూ అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ తమిళంలో 'బిరియాని', 'వాలు', 'వెట్త్టె మన్నన్'.. వంటి ఆరు సినిమా ప్రాజెక్టులతో వూపిరి సలపనంత బిజీ బిజీగా ఉంది. 2014లో తెలుగులో కూడా ఒక సినిమా చేయడానికి అంగీకరించింది.
 
==చిత్రసమాహారం==
పంక్తి 49:
 
* ఆబ్ర కా దబ్ర (డిసెంబర్ 24, 2004)
* హమ్ కౌన్ హై (సెప్టెంబర్ 3, 2004) ...... సారా విలియమ్స్
* జాగో (ఫిబ్రవరి 6, 2004) ...... శృతి
* [[కోయీ మిల్ గయా]] (ఆగష్టు 8, 2003) ...... ది సూపర్ సిక్స్
* హవా (జూలై 4, 2003)
* ఎస్కేప్ ఫ్రమ్ తాలిబాన్ (ఫిబ్రవరి 14, 2003)...... గున్చా (సీమా మోట్వానీగా)
"https://te.wikipedia.org/wiki/హన్సిక_మోత్వానీ" నుండి వెలికితీశారు