"సముద్రాల రామానుజాచార్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
 
[[యన్‌.టి.రామారావు]]కి- రామానుజం రికార్డిస్టుగా ఉన్నప్పట్నుంచీ తెలుసు. ఆయన సాహిత్యాభిలాష తెలుసు. పాటలు రాస్తున్న విషయమూ తెలుసు. అంచేత తను ప్రారంభిస్తున్న 'తోడు దొంగలు' (1954)కు రచన చెయ్యమని అడిగి ఆ సినిమాకి రాయించారు. అది రామానుజం మాటలు రాసిన తొలి సినిమా. దర్శకత్వ శాఖలో కూడా పనిచెయ్యాలని, ఆయన ఎన్‌.ఎ.టి.లో సెట్సు మీద కూడా పనిచేశాడు. రామానుజం రెండో సినిమా 'జయసింహ' (1955) జయ పతాకం ఎగరవేసినప్పట్నుంచి, రామానుజం 'సముద్రాల జూనియర్‌'గా మారి సంభాషణలు రాయడం మీదనే దృష్టి సారించాడు. 'పాండురంగ మహాత్మ్యం' (1957), 'మంచి మనసుకి మంచి రోజులు' (1958), 'శాంతి నివాసం' (1960), 'ఆత్మ బంధువు' (1962), 'ఉమ్మడి కుటుంబం' (1967) 'స్త్రీ జన్మ' (1967), 'తల్లా? పెళ్లామా?' (1970), 'శ్రీ రామాంజనేయ యుద్ధం' (1975) లాంటి 70 చిత్రాలకు పైగా రచన చేశాడు జూనియర్‌ సముద్రాల. <ref>http://www.eenadu.net/archives/archive-14-10-2009/ncineshow.asp?qry=gnapaka</ref>
 
"సముద్రాల రచించిన ఒక పద్యం"
<poem>
ఏ పాదసీమ కాశీప్రయాగాది ప
విత్ర భూములకన్న విమలతరమో
ఏ పాదపూజ రమాపతి చరణాబ్జ
పూజలకన్నను పుణ్యతరమో
ఏ పాదతీర్ఠము పాపసంతాపాగ్ని
ఆర్పగలిగినయట్టి అమృతఝరమో
ఏ పాదస్మరణంబు నాగేంద్రశయనుని
ధ్యానమ్ముకన్నను ధన్యతరమో
 
అట్టి పితరుల పదసేవ ఆత్మమరచి
ఇహపరములకెడమై తపించువారి
కావగలవారు లేరు జగానవేరే
నన్ను మన్నించి బ్రోవుమా అమ్మనాన్నా!!
 
==సినిమాలు==
*[[శ్రీ దత్త దర్శనం]] (1985)
1,056

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1271192" నుండి వెలికితీశారు