చందమామ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
సమాచార పెట్టె చేర్చితిని
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|బాలల మాస పత్రిక చందమామ|}}
{{Infobox Magazine

| title = చందమామ
[[దస్త్రం:1STCHANDAMAMA.jpg|right|thumb||150px|చందమామ తొలి ముఖపుట,జులై 1947]]
| image_file = 1STCHANDAMAMA.jpg
[[దస్త్రం:Chandamama-logo.jpg|left|thumb|చందమామ లోగొ రాజా ర్యాబిట్]]
| image_size = 250px
[[దస్త్రం:1STCHANDAMAMA.jpg|right|thumb||150px| image_caption = చందమామ తొలి ముఖపుట,జులై 1947]]
| company = [http://geodesic.com Geodesic Information Systems Limited]|
| frequency = మాసపత్రిక
| paid_circulation =
| unpaid_circulation =
| total_circulation =
| language = [[తెలుగు]]
[[సంస్కృతం]]
[[అస్సామీ]]
[[హిందీ]]
[[ఒరియా]] ('Janhamaamu' గా)
[[ఆంగ్లము]]
[[కన్నడం]]
[[మరాఠీ]]('చందోబా' గా)
[[తమిళం]]
| New = జూనియర్ చందమామ
| category = [[బాలలు]]
| editor = ప్రశాంత్ ములేకర్
| firstdate = 1947
| country = {{flag|India}}
| website = {{url|http://www.chandamama.com}}
| issn =

[[దస్త్రం:Chandamama-logo.jpg|leftright|150px|thumb|చందమామ లోగొ రాజా ర్యాబిట్]]
'''చందమామ''' సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. [[1947]] జూలై నెలలో [[మద్రాసు]] నుంచి [[తెలుగు]], [[తమిళ భాష]]ల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, [[సింగపూరు]], [[కెనడా]], [[అమెరికా]] దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది.చందమామను [[బి.నాగిరెడ్డి]] - [[చక్రపాణి]](వీరు తెలుగు, తమిళ బాషల్లో ఆణిముత్యాలవంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ విజయా సంస్థ వ్యవస్థాపకులు కూడా) [[1947]] జూలైలో ప్రారంభించారు. కేవలం 6 వేల సర్క్యులేషన్ తో మొదలైన చందమామ నేడు 2 లక్షల సర్క్యులేషన్‌తో అలరారుతోందని తెలుస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతం , ఎందుచేతనంటే, చందమామ ప్రకటనలమీద ఒక్క పైసాకూడ ఖర్చు చెయ్యదు. ఈ పత్రికకు 6 - 7 లక్షల సర్క్యులేషన్ సాధించవచ్చని అంచనా. టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్ లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ణానదాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే. చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు. రామాయణ కల్పవృక్షం, [[వేయి పడగలు]] వంటి అద్భుత కావ్య రచనలు చేసి జ్ఞానపీఠ ప్రదానం పొందిన ప్రముఖ రచయిత, కవిసామ్రాట్ [[విశ్వనాధ సత్యనారాయణ]] '''"చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా'''" అని ఒక సందర్భంలో అన్నాడంటే, చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల, పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థంచేసుకోవచ్చును.
[[దస్త్రం:Chandamama First Cover Page.jpg|right|thumb|100px|1947లో]]
Line 114 ⟶ 131:
== చందమామ మూసివేత- పునఃప్రారంభం ==
[[1998]] అక్టోబరు నెలలో అనివార్య పరిస్థితుల్లో ప్రచురణ ఆగిపోయిన చందమామ [[1999]] డిసెంబరు నెలలో తిరిగి మొదలైంది. మోర్గాన్ స్టాన్లీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ సేథి, కార్వీ కన్సల్టెంట్స్ కు చెందిన సుధీర్ రావు, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఎస్. నీలకంఠన్, ప్రముఖ చిత్రకారుడు ఉత్తమ్ కుమార్, మార్కెటింగ్ నిపుణుడు మధుసూదన్ లు చందమామ పునఃస్థాపనకు మూల కారకులు. చందమామ ప్రత్యేకతలుగా గుర్తింపు పొందిన కథన శైలి, సాంకేతిక నైపుణ్యాలను రంగరించి పంచతంత్రం, జాతక కథలు లాంటివాటిని బొమ్మల కథలుగా రూపొందించి ఇతర పత్రికలకు అందజేయడానికి సిండికేషన్ ద్వారా ముందుకు వచ్చింది చందమామ. తెలుగు మరియు ఇతర భాషల్లో అనేక పత్రికలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాయి.అప్పటి వరకూ పూర్తిగా బి.నాగిరెడ్డి కుటుంబ సభ్యులకే పరిమితమై ఉన్న చందమామ ప్రచురణ మరియు నిర్వహణ హక్కులు కొత్తగా స్థాపించబడిన '''చందమామ ఇండియా లిమిటెడ్''' కు బదిలీ చేయబడ్డాయి. అందులో బి.నాగిరెడ్డి కుమారుడైన బి.విశ్వనాథరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 40% వాటా, వినోద్ సేథి, సుధీర్ రావు, ఇతరులకు 60% వాటా ఇవ్వబడ్డాయి. బి.విశ్వనాథరెడ్డి (విశ్వం) చందమామ సంపాదకుడుగానూ, ప్రచురణకర్తగానూ, చందమామ ఇండియా లిమిటెడ్ మానేజింగ్ డైరెక్టర్ గానూ కొన్నేళ్ళు కొనసాగాడు. చివరికి [[2009]] నాటికి చందమామ యాజమాన్యం ముంబైకి చెందిన జియోదెశిక్ అనబడే సాప్ట్‌వేర్ సంస్థ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అన్ని భారతీయ భాషల్లోను చందమామ సంపాదకుడు, ప్రచురణకర్త ఎల్. సుబ్రహ్మణ్యన్.
==మూలాలు==

== బయటి లింకులు ==
* [http://www.chandamama.com/lang/index.php?lng=TEL చందమామ తెలుగు వెబ్‌సైటు]
"https://te.wikipedia.org/wiki/చందమామ" నుండి వెలికితీశారు