అయ్యగారి సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
== ఎలక్ట్రానిక్స్ రంగానికి అపురూప సేవలు==
ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్)లో కాస్మిక్ కిరణాలపై పరిశోధనల్లో డాక్టర్ ఏఎస్‌రావు అద్భుత విజయం సాధించారు. ఆసియా ఖండంలోనే మొదటిసారిగా భారత్ రూపొందించిన అణు రియాక్టర్ అప్సరకు కంట్రోల్, మానిటరింగ్ పరికరాలను సమకూర్చారు. బార్క్‌లో ఎలక్ట్రానిక్స్ గ్రూప్‌కి డైరెక్టర్‌గా పనిచేసినపుడు డిజైన్, డెవలప్‌మెంట్ ఇంజనీరింగ్ అంశాల మీద పరిశోధనలు చేశారు. అప్పుడే స్వదేశీ పరిజ్ఞానంతో డిఫెన్స్, అణుశక్తిరంగాలకు ఎలక్ట్రానిక్స్ వ్యాప్తి చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది. దీంతో కేంద్రం హోమి జే బాబా నేతృత్వంలో విక్రమ్ సారాభాయ్, భగవంతం, ఏఎస్‌రావు సభ్యులుగా ఎలక్ట్రానిక్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రతిపాదన నుంచి ఉద్భవించిందే ఈసీఐఎల్ సంస్థ.
===ఈసీఐల్ ఆవిర్భావం===
హైదరాబాద్‌లో ఈసీఐఎల్ సంస్థ ఆవిర్భావానికి డాక్టర్ ఏఎస్‌రావు కృషి మరవలేనిది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, అణు శాస్త్రవేత్త హోమి జె. బాబాతో ఉన్న పరిచయాలతో 1967 ఏప్రిల్ 11న కాప్రాపట్టణం కుషాయిగూడలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)ను స్థాపించి డాక్టర్ విక్రం సారాభాయ్ ఛైర్మన్‌గా, ఏఎస్‌రావు ఎండీగా వ్యవహరించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నలుపు-తెలుపు టీవీలు, కంప్యూటర్‌లను రూపొందించారు. సంస్థ స్థాపనతో దేశంలోని అనేక ప్రాంతాల వారికి ఉద్యోగావకాశాలు లభించాయి. ప్రస్తుతం ఇందులో సుమారు 3వేల మంది పనిచేస్తున్నారు. విభిన్న రంగాలకు ఉత్పత్తులను అందజేస్తూ సంస్థ ఆగ్రస్థానంలో నిలుస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, చంద్రయాన్ 32మీటర్ డీఎస్ఎన్ యాంటీనా, బ్రహ్మోస్ మిసైల్ చెక్అవుట్ వెహికల్, అణువిద్యుత్ కంట్రోల్ సిస్టమ్స్, మేజర్ అట్మాస్పెరిక్ చెరెంకోవ్ ఎక్స్‌పెరిమెంట్ (మేస్) టెలిస్కోప్, నిషేధిత ప్రాంతాల్లో భద్రతకు రోడ్డు బ్లాకర్, ఎక్స్‌రే బ్యాగేజ్.. ఇలా రక్షణ, అంతరిక్షం తదితర రంగాలకు పలు ఉత్పత్తులను అందించింది.
 
==పురస్కారాలు==