రాగం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 27 interwiki links, now provided by Wikidata on d:q216926 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{భారతీయ సంగీతం}}
[[భారతీయ సంగీతం]]లో కొన్ని [[స్వరం|స్వరాల]] సమూహము '''రాగం'''.
 
[[File:Malkosa Raga.jpg|thumb|మాల్కోసా రాగం-రాగమాల సీరిస్ లోని ఒక దృశ్యం]]
రాగ సృష్టి సంగీత ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుకగా భావిస్తారు. రాగాలకు సంబంధించిన మూల భావాలు సామవేదంలో ఉన్నట్లు సంగీతకోవిదులు చెబుతారు. మన సంప్రదాయ సంగీతములోని రెండు స్రవంతులకు కూడా రాగమే అధారం. రాగమేళకర్త ప్రణాళికననుసరించి రాగాలను 12 రాశులు లేదా సముహాలుగా వర్గీకరిస్తారు. ఒక్కొక్క సమూహాంలో ఆరు రాగాలు వరకు ఉంటాయి. వానిని జనక రాగాలు అంటారు. అనేక జన్యరాగాలకు ఆధారం జనకరాగాలే.ఈ రాగాలకు రూప కల్పన చేసిన వారు వేంకటమహి. హిందుస్థానీ సంగీతంలో కూడ ఈ 72 రాగాలలో ఓ పదింటిని విస్తృతంగా వాడతారని పరిశీలకుల భావన. 72 రాగాలకు ధీర శంకరాభారణం, కీరవాణి, నట భైరవి, గౌరీ మనోహరి వంటి ప్రత్యకనామాలున్నాయి. హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలు ఒకే సంప్రదాయం నుండి పుట్టినప్పటికీ వానిని ఆలపించడంలోను, సాధన చేయడంలోను ఎంతో వైరుధ్యం ఉంది. భాషాపరమైన ప్రాంతీయమైన, సాంకేతికమైన, సామాజిక రాజకీయ కారణాలు ఈ వైరుధ్యానికి హేతువులని అంటారు.
Line 7 ⟶ 6:
== రాగాలు-రకాలు ==
ఆరోహణ, అవరోహణలను బట్టి రాగాలను రెండుగా విభజించారు.
=== జనక రాగాలు ===
జనక రాగాలను [[మేళకర్త రాగాలు]], [[సంపూర్ణ రాగాలు]] అంటారు. ఇవి 72 ఉన్నాయి. వీటి లక్షణాలు:
* ఆరోహణ, అవరోహణలలో సప్తస్వరాలు ఉంటాయి.
* ఆరోహణ, అవరోహణలోని సప్తస్వరాలు క్రమ పద్ధతిలో వరుస మారకుండా ఉంటాయి.
* ఆరోహణలో ఏఏ అంతర గాంధారాది క్రమం ఉంటే, అవరోహణలో కూడా అదే క్రమం ఉంటుంది.
 
 
ఈ 72 జనక రాగాలను రెండు భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి 36 రాగాలకు శుద్ధ మధ్యమం ఉన్నందువలన, ఈ పూర్వ మేళ రాగాలను 'శుద్ధ మధ్యమ రాగాలు' అంటారు. తరువాత 36 రాగాలకు ప్రతి మధ్యమం ఉన్నందువలన ఈ ఉత్తర మేళ రాగాలను 'ప్రతి మధ్యమ రాగాలు' అంటారు.
==12 చక్రాలు==
 
 
పూర్వ, ప్రతి మధ్యమ రాగాలలో ఒక్కొక్క విభాగాన్ని ఆరు సూక్ష్మ విభాగాలుగా చేసి, 12 భాగాలు ఏర్పరచారు. వీటిని 'చక్రములు' అంటారు. ఒక్కొక్క చక్రంలో ఆరు రాగాలు ఉండేలా విభజన చేశారు. ఈ పన్నెండు చక్రాల పేర్లు:
* 1. '''ఇందు చక్రం''' : కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి మరియు తానరూపి రాగాలు.
Line 30 ⟶ 27:
* 11. '''రుద్ర చక్రం''' : కాంతామణి, రిషభప్రియ, లతాంగి, వాచస్పతి, మేచకళ్యాణి మరియు చిత్రాంబరి రాగాలు.
* 12. '''ఆదిత్య చక్రం''' : సుచరిత్ర, జ్యోతిస్వరూపిణి, ధాతువర్ధిని, నాసికాభూషణి, కోసలము మరియు రసికప్రియ రాగాలు.
=== జన్య రాగాలు ===
 
=== జన్య రాగాలు ===
{{wiktionary}}
మేళకర్త రాగాల నుండి పుట్టినవి ఈ జన్య రాగాలు. వీటిని స్వరభేదం చేత వివిధ రాగాలుగా విభజించారు.
* '''ఉపాంగ రాగాలు''' : ఇది 15వ మేళకర్త రాగమైన మాయామాళవ గౌళ రాగం యొక్క జన్యం. ఉదాహరణ - సావేరి, మలహరి రాగాలు.
Line 41 ⟶ 36:
* '''పంచమాంత్య రాగాలు''' : కొన్ని రాగాలు మధ్యస్థాయి పంచమంతో అంతమవుతాయి. ఉదాహరణ - నవరోజు రాగం.
* '''దైవతాంత్య రాగాలు''' : కొన్ని రాగాలు మధ్యస్థాయి దైవతంలో అంతమవుతాయి. ఉదాహరణ - కురంజి రాగం.
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
[[వర్గం:సంగీతం]]
"https://te.wikipedia.org/wiki/రాగం" నుండి వెలికితీశారు