కొలనుపాక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 155:
 
* మధ్య యుగం - క్రీ.శ. 1008 - 1015 అయిదవ [[విక్రమాదిత్యుడు|విక్రమాదిత్యుని]] కాలం - నాటికి కొలనుపాక ఒక దుర్భేద్యమైన [[కోట]]గా విలసిల్లింది. చోళరాజులు (రాజేంద్ర చోళుడు క్రీ.శ. 1013-1014) తాత్కాలికంగా దీనిని జయించినా మళ్ళీ ఇది చాళుక్యుల అధీనంలోకి వచ్చింది. కళ్యాణీ చాళుక్యుల పాలన క్షీణించిన తరువాత ఇది [[కాకతీయులు|కాకతీయుల]] పాలనలోకి వచ్చింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు దీనికి సమీపంలోనే ఉన్నందున ఈ కాలంనుండి కొలనుపాక ప్రాముఖ్యత పలుచబడింది.
 
==శిల్పకళ==
ఆలయ ప్రవేశ ద్వారం చూస్తే కోటద్వారాన్ని తలపిస్తుంది.అక్కణ్ణుంచి రెండు నల్లని ఏనుగులు లోపలికి ఆహ్వానిస్తున్నట్లుంటాయి. ఆలయ నిర్మాణానికి ఢోల్‌పూర్ రాయిని రాజస్థాన్ నుంచి తెప్పించారు. బయటకు వచ్చేందుకు కుడిపక్కా ఎడమపక్కా రెండు ద్వారాలున్నాయి. లోపలంతా భారీ గోపురం. ప్రతి స్తంభంలోనూ సూక్ష్మచిత్రకళ అబ్బుర పరుస్తుంది. ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేమినాథుడు లాంటి జైనదేవుళ్ళ బొమ్మలే ప్రధాన ఆకర్షణ. ఆలయం లోనికి అడుగుపెట్టగానే ఎడమవైపునుంచి తీర్థంకరుల బొమ్మలు కనిపిస్తాయి. ఇందులో బంగారం, పాలరాయి, నల్లరాతితో చేసినవి ఉన్నాయి. లోపల నేలంతా పాలరాయే. ఆలయం చుట్టుపక్కల చెట్లు, ఇంకా మరో దేవాలయం ఉన్నాయి. ఆలయ ఆవరణమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో నలుగురు తీర్థంకరుల బొమ్మలతో ఏర్పాటు చేసిన పెద్ద బొమ్మ ఉంది. దీనికి జైనుల పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
 
గ్రామ పరిసర ప్రాంతల్లో వివిధ త్రోవ్వకల్లో లభించిన శిల్పాలు, దేవతా మూర్తుల ప్రతిమలు మరియు శిలా శాసనాలు తెచ్చి మ్యు జియం ఏర్పాటు చేసారు ,ఇప్పటికి గ్రామములో ఏ త్రొవ్వకం చెసినా ఏదో ఒకటి బయటపడుతుంది
 
కొలనుపాక వస్తుప్రదర్శనశాలలో జైనుల, వీరశైవుల చరిత్రను చెప్పే అనేక బొమ్మలు, చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. వీరశైవులకు పూజ్యనీయులైన రేణుకాచార్యుల వారు లింగంలోనుంచి ఉద్భవించిన ప్రదేశం కూడా కొలనుపాకే అని భావిస్తున్నారు. సోమేశ్వరాలయంగా చెప్పే ఈ ఆలయంలో రేణుకాచార్యుల లింగోద్భవ శిల్పాన్ని చూడవచ్చు. ఆలయంలో ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని చాటిచెప్పే శిల్పసంపదను చూడవచ్చు. అయితే ప్రస్తుతం అవన్నీ నిరాదరణకు గురై ఉన్నాయి.
 
==ముఖ్యమైన వ్యక్తులు==
"https://te.wikipedia.org/wiki/కొలనుపాక" నుండి వెలికితీశారు