రాజులు (కులం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 153:
 
== ప్రస్తుత స్థితి ==
ఆంధ్ర క్షత్రియ సామ్రాజ్యాల వంశస్తులు నేడు గొదావరి జిల్లాలలో [[రాజు]]లుగా పిలువబడుచున్నారు. గృహనామాలు, మరియు గోత్రాల పేర్లు బట్టి వీరిని గుర్తుబట్టవచ్చును. వీరి పేర్ల చివర ఎక్కువగా రాజు లేక వర్మ <ref>శ్వేత యజుర్వేదము, గృహ సూత్రములు - 4 వ అధ్యాయము, 17 వ కందకము </ref> అని ఉంటుంది. భారతీయ కుల వర్గీకరణ వ్యవస్థ ప్రకారం నేడు ఆంధ్ర దేశంలో వీరు ఇతర కులాల(O.C) విభాగానికి చెందుతారు <ref>Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories - by K. Srinivasulu , Department of Political Science, Osmania University, Hyderabad </ref> . భారతదేశం సార్వభౌమాధికార దేశంగా ఆవిర్భవించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న క్షత్రియ కుటుంబాలను క్షత్రియ కులంగా వర్గీకరించింది. ఆ క్రమంలో ఆంధ్రదేశంలో ఉన్న జన్మతరహా క్షత్రియ కుటుంబాలవారు కూడా క్షత్రియులు (లేక రాజులు) గా వర్గీకరించబడ్డారు. ప్రస్తుతం క్షత్రియుల జనాభా ఆంధ్రప్రదేశ్ లో కేవలం 1% మాత్రమే ఊన్నారు.
 
ఒకప్పుడు రాజ్యాలేలిన వీరు, ప్రస్తుతం ప్రధానంగా వ్యవసాయం, వ్యాపారరంగం, పారిశ్రామిక రంగం, వివిధ సేవారంగాలైన విద్య, సినిమా, సాంకేతిక రంగం మొదలైన రంగాలలో విస్తరించి యున్నారు. ఈ రంగాలలో వీరు గణణీయమైన అభివృద్ధిని సాధించి, ఆంధ్రప్రదేశ్ సమాజంలో ప్రముఖులుగా పరిగణింపబడుతున్నారు. ఇటీవల వీరిలో చాలా మంది హైదరాబాదు నగరంలోనూ, అమెరికాలోనూ స్థిరపడ్డారు. నేడు ఆంధ్ర క్షత్రియుల్లో కొద్ది మంది మాత్రమే ధనవంతులుగా ఉన్నా చాలా వరకూ దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారు. [[భారతదేశంలో రిజర్వేషన్]] పద్ధతి ప్రకారం ఆంధ్ర క్షత్రియులు ఒ.సి విభాగానికి చెందుతారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. అందుచేత రిజర్వేషన్ సిష్టమ్ కేవలం కులాన్ని బట్టి కాకుండా ఆర్ధిక స్థితిని బట్టి ఉంటే న్యాయమని సామాజిక విశ్లేషకుల భావన.
"https://te.wikipedia.org/wiki/రాజులు_(కులం)" నుండి వెలికితీశారు