అజిత్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q339896
పంక్తి 14:
'''అజిత్ కుమార్''' ప్రముఖ దక్షిణాది నటుడు. ఇతను [[ఆంధ్రప్రదేశ్]] లోని [[సికింద్రబాద్]] లో జన్మించాడు.తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన [[ప్రేమ పుస్తకం]] తో ప్రారంభించాడు. ప్రముఖ నటి [[w:en:Shalini Kumar|షాలిని]] ని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది పదవ తరగతి వరకు ఐనా బహుభాషాకోవిదుడు.[[తెలుగు]], [[తమిళం]],[[కన్నడ]],[[మళయాలం]],[[ఆంగ్లం|ఆంగ్ల]] భాషలను అనర్గళముగా మాట్లాడగలడు.
==నేపధ్యము==
[[సికింద్రాబాద్]] లో పుట్టిన అజిత్.. పదోతరగతి వరకు మాత్రమే చదివినా, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదుమాట్లాడగలడు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంతో పాటు ఇంగ్లీషు పరిజ్ఞానం కూడా అజిత్ కు ఎక్కువే. ఒకప్పటి టాప్ హీరోయిన్ [[షాలిని]]ని 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. నాలుగు పదుల వయసు దాటి, జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నాడు. అయినా కూడా అజిత్ కు ప్రేక్షకుల ఆదరణ అదే స్థాయిలో ఉంటోంది. మూడుసార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు పొందిన అజిత్ గురించి చాలామందికి తెలియని విషయం.. అతడు దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకడు. 2004లో బ్రిటిష్్ ఫార్ములా తీ్ర సీజన్ లో ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్ గా పాల్గొన్నాడు. దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో మూడో స్థానం పొందాడు. రేసింగులో పాల్గొనాలనే ముందు బైకు మెకానిక్ గా జీవితం ఆరంభించాడు. ఒకసారి ప్రమాదం జరగడంతో, తర్వాత పలు వ్యాపార ఏజెన్సీలు ఆయనను మోడలింగ్ చేయాల్సిందిగా కోరాయి. అటునుంచి 1992లో ప్రేమపుస్తకం అనే తెలుగు సినిమాలో నటించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/అజిత్_కుమార్" నుండి వెలికితీశారు