రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
విశ్వనాథ వారి కల్పవృక్షము బాలకాండములోని అవతారిక పద్యాలతో ప్రారంభమవుతుంది. వీటిలో విశ్వనాథ సత్యనారాయణ తనకు రామాయణ వ్రాసేందుకు కలిగిన ప్రేరణ, చేసిన ప్రయత్నం వంటివి చెప్పుకున్నారు. తన వంశము, కావ్యానికి వ్రాయసకానిగా వున్న తమ్ముడు వెంకటేశ్వరరావు వంటి వారి వివరాలతో కూడిన అనేక పద్యాలు కూడా అవతారికలో వుంటాయి.
=== ఇష్టిఖండము ===
మొదటిగా వచ్చే ఖండం పేరు ఇష్టి ఖండము. ఈ ఖండములో దశరథ మహారాజు, ఆయన మువ్వురు భార్యలు, సంతానలేమి, ప్రయత్నాలు, మంత్రుల సలహాతో యాగం చేయుట, యాగఫలంగా యజ్ఞపురుషుడు పాయసపాత్రలివ్వడం వరకూ ఉన్న కథ వస్తుంది. వాల్మీకి రామాయణంలోని మూలకథనం నుంచి కల్పవృక్షములోని ఇష్టిఖండములోని కథనం పలుమార్లు భేదిస్తుంది వాల్మీకంలో దశరథుని ముగ్గురు భార్యలైన కౌశల్య, సుమిత్ర, కైకేయిల ప్రస్తావన యాగప్రారంభం వరకూ రాకపోగా కల్పవృక్షకారుడు ఆ ప్రస్తావనే కాక విపులమైన వివరణలు, వారి లక్షణముల విశేష వర్ణనలు కూడా దశరథుని ప్రస్తావన కాగానే మొదలుపెడతారు. ''కౌశల్యముక్తికాంతా సమానాకార'' అంటూ ప్రారంభమయ్యే సీసపద్యంలో ఒక పాదం కౌశల్య గురించి, ఒక పాదం కైకేయి గురించి, రెండు పాదాలు సుమిత్ర గురించి మళ్ళా కౌశల్యతో ప్రారంభించి అదే పద్ధతిలో వస్తాయి. ఇదంతా భవిష్యత్తులో కౌశల్యకు, కైకకు ఒక్కొక్క పుత్రుడు, సుమిత్రకు ఇద్దరు కుమారులు కలగబోతున్నారని సూచనే కాక ఆయా లక్షణాలు కూడా పుట్టబోయే కొడుకుల మూలలక్షణాలకు సామ్యంతో వుండడం గొప్ప విశేషమని విమర్శకులు పేర్కొన్నారు.
 
==కథనం==
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు