ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
లక్ష్మణస్వామి మొదలియారు వైద్యవృత్తినీ, వైద్యవిద్యనీ చేపట్టి రెండింటిలోనూ ప్రతిభ చూపారు. అనంతర కాలంలో అనేకమైన పదవుల్లో ప్రపంచవైద్యసంస్థకు, దేశంలోని వైద్యసంస్థలకు సేవలు చేసినా ప్రధానంగా ఆయన చికిత్సలోనూ, బోధనలోనూ ఉద్యోగ జీవితాన్ని గడిపారు.
=== చికిత్సరంగంలో ===
వైద్యవిద్య పూర్తిచేసుకున్న వెంటనే లక్ష్మణస్వామికి 1909లో ప్రభుత్వ వైద్యశాఖలో ఉద్యోగం లభించింది. మొదటి సంవత్సరం [[మదురై]], పశని పట్టణాల్లో పనిచేసి ఆపైన [[మద్రాసు]]కు బదిలీ అయ్యారు. మద్రాసులో మొదట ఆయనను డొనోవన్ అనే ప్రఖ్యాత వైద్యునికి సమాయకునిగా నియమించారు. ఆపైన 1912లో ఎగ్మూరులోని ప్రభుత్వ స్త్రీ, శిశు ఆసుపత్రికి బదిలీ చేశారు. ఆనాటి నుంచీ ఆయన స్త్రీ, ప్రసూతి, శిశు వైద్యరంగంలో విశేష నైపుణ్యాన్ని కనబరిచి అదే ఆసుపత్రిలోస్పెషలైజేషన్ లో ఏళ్ళతరబడి పనిచేయడమే కాక సుప్రఖ్యాతులయ్యారు. 1914లో ఆయన బి.యే. పూర్తచేసుకుని పట్టభద్రుడు కావడంతో ఆయనను రాయపురంలోని ప్రసూతి ఆసుపత్రికి ఉద్యోగోన్నతిపై బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన మంచి వైద్యునిగా పేరుగడించి తన బాధ్యతలు నిర్వర్తించారు.
 
=== వైద్యబోధనలో ===