మహాప్రస్థానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
== ఇతివృత్తాలు ==
మహాప్రస్థానం గేయాల్లోని ఇతివృత్తాలు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా మానవజాతి ఎదుర్కొంటున్న బాధలు, వీటికి నేపథ్యంగా ఉన్న చారిత్రిక పరిణామాలు, పీడితుల పక్షాన నిలవాల్సిన కవికి అవసరమైన లక్షణాలు, నూతనమైన ఈ అంశాలపై రావాల్సిన కవిత్వమూ, తన కవిత్వానికి లక్షణాలు, పీడితులను ఇంకా పీడించేందుకు సహాయకారిగా ఉండే తాత్త్వికతలపై తిరుగుబాటు వంటివి ఉన్నాయి. వీటన్నిటికీ మూలమైన నేపథ్యంగా తన కవితాతాత్త్వికతనీ, దానికి వెనుకనున్న సంఘర్షణనీ అపురూపంగా వెల్లడించిన కళాఖండమైన '''కవితా ఓ కవితా''' కూడా ఉంది.<br />
 
మొదటి గేయం మహాప్రస్థానం. అదొక కవాతు పాట లాంటిది. ''పదండి ముందుకు పదండి త్రోసుకు'' అంటూ ప్రబోధించే ఈ గేయం ''హరోం! హరోం హర! హరోం! హరోం హర!హర! హర! హర!'' అంటూ యుద్ధనినాదం చేసుకుంటూ కదలమన్నాడు. ''ఐ'' గేయంలో తాను ''స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం'' అని చెప్పుకున్నారు, ''నా మహోద్రేకాలు భవభూతి శ్లోకాలు, పరమేష్ఠి జూకాలు'' అంటూ తన గురించి వ్రాసుకున్నారు. దీనిని విమర్శకులు నిర్ద్వంద్వంగా, నిరాఘాటంగా చేసుకున్న ఆత్మస్తుతిగా పేర్కొన్నారు. మూడో కవిత ''జయభేరి''. ''నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను'' అంటూ సాగే ఈ గేయంలో తన వల్ల అయ్యేది తాను చేయగలగడం మొదలుకొని తుదకు ఆ తానే ''భువన భవనపు బావుటానై పైకి లేస్తానని'', ''నా కుహూరుతశీకరాలే, లోకమంతా జల్లులాడే, ఆ ముహూర్తా లాగమిస్తాయి'' అన్నారు.
 
== యోగ్యతా పత్రం ==
"https://te.wikipedia.org/wiki/మహాప్రస్థానం" నుండి వెలికితీశారు