హార్సిలీ హిల్స్: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: ఫారెస్టు బంగ్లా బొమ్మ చేర్పు
+బొమ్మల కొలువు
పంక్తి 1:
[[బొమ్మ:హార్సిలీ హిల్స్ ఫారెస్టు బంగ్లాదృశ్యం1.jpg|thumb|right|హార్సిలీ హిల్స్ లో ఫారెస్టు బంగ్లాదృశ్యం]]
'''హార్సిలీ హిల్స్''' [[చిత్తూరు]] జిల్లా [[మదనపల్లె]] దగ్గర ఉన్న ఒక విహారస్థలం. ''ఏనుగు మల్లమ్మ కొండ'' అనేది దీని అసలు పేరు. [[ఆంధ్ర ప్రదేశ్]] లోని ప్రసిద్ధ వేసవి విడిది. ''ఆంధ్రా ఊటీ'' అని దీనికి పేరు.
 
==భౌగోళికం==
[[బొమ్మ:యూకలిప్టస్ చెట్టు.jpg|right|thumb|142 ఏళ్ళ నాటి యూకలిప్టస్ చెట్టు]]
తూర్పు కనుమల లోని దక్షిణ భాగపు కొండల వరుసే ఇక్కడి కొండలు. హార్సిలీ హిల్స్ సముద్ర మట్టానికి 1,314 మీ. (4312 అ.) ఎత్తులో ఉంది. ఇది [[బెంగళూరు]] నుండి 160 కి.మీ., [[తిరుపతి]] నుండి 140 కి.మీ. దూరంలో ఉంది. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడు నుండి మండు వేసవిలో 32 డిగ్రీల సెంటీ గ్రేడు వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా ఎత్తైన ప్రదేశం హార్సిలీ హిల్స్ లోనే ఉంది.
 
==చరిత్ర==
 
[[బొమ్మ:హార్సిలీ హిల్స్ ఫారెస్టు బంగ్లా.jpg|thumb|right|హార్సిలీ హిల్స్ లో ఫారెస్టు బంగ్లా]]
డబ్ల్యూ.హెచ్.హార్సిలీ అనే బ్రిటిషు అధికారి [[1863]] - 67 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో కలెక్టరుగా పని చేసాడు. 1863 లో వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించాడు. దీన్ని ఫారెస్టు బంగ్లా అంటారు. ఆ తరువాత కార్యాలయ భవనం నిర్మించారు. ఈ భవనాలు ఇప్పటికీ నివాస యోగ్యంగా ఉండి, వాడుకలో ఉన్నాయి. ఫారెస్టు బంగ్లాలోని నాలుగు గదుల్లో ఒక దానికి హార్సిలీ పేరు పెట్టారు.
 
==చూడదగ్గ స్థలాలు==
ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం ఇక్కడి ప్రత్యేకతలు. హార్సిలీ హిల్లహిల్స్ కు వెళ్ళే కొండదారి ఎంతో అందంగా ఉంటుంది. రెండు వైపులా [[యూకలిప్టస్]] వంటి అనే జాతుల చెట్లతో కళ్ళకింపుగా ఉంటుంది. ఇక్కడ చూడదగ్గ ఇతర ప్రదేశాలు:
*142 సంవత్సరాల వయసు కలిగిన యూకలిప్టస్ చెట్టు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి.
*[[జిడ్డు కృష్ణమూర్తి]] నెలకొల్పిన రిషివ్యాలీ విద్యాలయము ఉన్నది.
 
==బొమ్మల కొలువు==
 
<gallery>
బొమ్మ:హార్సిలీ హిల్స్ దృశ్యం2.jpg|కొండ దృశ్యం
బొమ్మ:హార్సిలీ హిల్స్ ఫారెస్టు బంగ్లా.jpg|హార్సిలీ హిల్స్ లో ఫారెస్టు బంగ్లా
బొమ్మ:హార్సిలీ హిల్స్ సూర్యాస్తమయం.jpg|సూర్యాస్తమయ దృశ్యం
బొమ్మ:వేణుగోపాల విగ్రహం.jpg|వేణుగోపాల విగ్రహం
</gallery>
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/హార్సిలీ_హిల్స్" నుండి వెలికితీశారు