జనమేజయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Snakesacrifice.jpg|thumb|సర్ప యాగము చేయుచున్న జనమేజయుడు]]
'''జనమేజయుడు''' మహాభారతంలో [[పరీక్షిత్తు]] కుమారుడు. [[అర్జునుడు|అర్జునునికి]] ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన [[వైశంపాయన మహర్షి|వైశంపాయనుడు]] ఇతనికి మహాభారత కథను వినిపించెను. మహాభారతంలో చెప్పినట్లుగా జనమేజయుడికి ఆరు మంది అన్నదమ్మలు. వారు కక్ష సేనుడు, ఉగ్ర సేనుడు, చిత్ర సేనుడు, ఇంద్రసేనుడు, సుశేణుడు, నఖ్యశేనుడు. <ref>''Journal of the Department of Letters'' by University of Calcutta (Dept. of Letters),Publ.Calcutta University Press, 1923, p2</ref>.
తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి [[తక్షకుడు]] కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి [[సర్పయాగము]] చేయడానికి సంకల్పించాడు. ఈ యాగం ప్రారంభం కానుండగా వ్యాస మహర్షి మిగతా ఋషులతో కలిసి వస్తాడు. కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే తక్షకుడు పరీక్షత్తు ను చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పజాతినీ మొత్తం నాశనం చేయ సంకల్పించడం, పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికారు. దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు. తన పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి ఉత్సుకత చూపడంతో ఎక్కడైతే యాగం చేయ సంకల్పించాడో అక్కడే వైశంపాయనుడు జనమేజయుడికి మహభారతం వినిపించాడు.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జనమేజయుడు" నుండి వెలికితీశారు