వక్కలంక సరళ: కూర్పుల మధ్య తేడాలు

+మూలం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Vakkalanka Sarala.jpg|thumbnail|వక్కలంక సరళ, 1953]]
'''వక్కలంక సరళ''' (1927 - 1999)<ref name=the_hindu>{{cite news|title=Rhythm of recall|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/rhythm-of-recall/article3748008.ece|accessdate=2 December 2014|work=The Hindu|issue=August 10, 2012}}</ref> తెలుగు సినిమా గాయని. కీలుగుర్రం సినిమాలోని 'కాదు సుమా కల కాదు సుమా' పాట పాడిన గాయనిగా ప్రసిద్ధి చెందింది. 1940వ దశకంలో జెమినీ స్టూడియో హిందీ విభాగంలో సహాయ సంగీత దర్శకురాలిగా పనిచేసింది.<ref>[http://www.hindu.com/mp/2003/02/05/stories/2003020500420300.htm Living out a dream - The Hindu Feb 05, 2003]</ref> ఈమె పూర్వీకులు అమలాపురానికి చెందిన బ్రాహ్మణులు, అయితే మద్రాసులో స్థిరపడ్డారు. సరళ తండ్రి గోపాలరావు, [[చలం]] (గుడిపాటి వెంకటాచలం) తమ్ముడు<ref>[http://www.pranahita.org/2009/03/kutumbamlo_sangeetam/ కుటుంబంలో సంగీతం - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌]</ref> సరళ 1927, ఆగష్టు 8 న మద్రాసులో సుందరమ్మ, గోపాలరావు దంపతులకు జన్మించింది. ఈమె తల్లి సుందరమ్మ కూడా గాత్ర సంగీత కళాకారిణే.
 
ఆమెకు అలనాటి సినీనటి అంజలీదేవికి మంచి స్నేహితురాలు. అంజలీదేవి మొదటిసినిమా బాలరాజు లో 'ఇది తీయని వెన్నెల రేయి' పాటను సరళ పాడింది. అప్పటి నుంచీ వారు స్నేహితులయ్యారు. 1950ల్లో అంజలీదేవి తీసిన 'స్వప్నసుందరి' తీసిన తర్వాత నాకు గనుక కూతురు పుడితే కచ్చితగా ఇదే పేరు పెడతానని సరళ అంజలీదేవికి మాటిచ్చింది. అలా మాటిచ్చిన పదేళ్లకు పుట్టిన బిడ్డకు మాట ప్రకారం స్వప్నసుందరి అని పేరుపెట్టింది.<ref>[http://m.newshunt.com/Eenadu/warangal/20839572/997 అంజలీదేవి సినిమా చూసి నాకు పేరు పెట్టారు - ఈనాడు]</ref> ఈమెఈమే కూచిపూడి నాట్యకళాకారిణి, పద్మభూషణ గ్రహీత స్వప్నసుందరి.
 
సరళ ఘంటసాలతో కలిసి 'సరళ, కాదు సుమా కల కాదు సుమా' పాటతో సహా అనేక పాటలు పాడింది. ఈమెకు ఘంటసాలతో పెళ్లికుదరబోయి, అనుకోని పరిస్థితుల్లో, ఘంటసాలకు మరో రంగూన్ ‘సరళ’తో ద్వితీయ వివాహం జరగింది.<ref>http://teblog.kinige.com/?tag=jeevita-katha</ref>
 
సరళ వివాహం అయ్యాక సినిమా రంగం నుంచి వైదొలగింది. ఆ రోజుల్లో దక్షిణభారతదేశంలో పెళ్లవగానే సినిమాల్ని వదిలేసేవాళ్లు. ఈమెకు స్వప్నసుందరితో పాటు మరో కూతురు, ఒక కొడుకు పుట్టారు. 1971లో విడుదలైన గోరింటాకు సినిమాలో నటించిన వక్కలంక పద్మ కూడా సరళ కూతురే.<ref>http://www.cinegoer.net/gorintaku.htm?ModPagespeed=noscript</ref>
 
సరళ కూతురు స్వప్నసుందరి ప్రతి సంవత్సరం తల్లి జ్ఞాపకార్ధం, ఆగష్టు 8న స్వరలహరి అనే కర్ణాటక సంగీత కచ్చేరిని నిర్వహిస్తుంది. ఈ కచ్చేరీలో యువ గాయనీగాయకులు సరళ స్వరపరచిన పాటలను ప్రముఖంగా పాడతారు.<ref name=the_hindu /><ref name=hindu_2007>{{cite news|title=Hyderabad today|url=http://www.thehindu.com/todays-paper/tp-miscellaneous/hyderabad-today/article1887931.ece|accessdate=2 December 2014|work=The Hindu|issue=August 8, 2007}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వక్కలంక_సరళ" నుండి వెలికితీశారు