ఎ.పి. కోమల: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
'''ఆర్కాట్ పార్థసారధి కోమల''' ({{lang-ta| ஏ.பி.கோமளா}}) (జ. ఆగష్టు 28, 1934)<ref name=imdb>{{IMDb name|0007298|Komala A. P.}}</ref> దక్షిణభారత దేశపు నేపథ్యగాయని.<ref name=imdb/> ఈమె 1950, 60వ దశకాల్లో తమిళం, [[మళయాలం]] మరియు [[తెలుగు]] భాషల్లో అనేక పాటలు పాడింది. రేడియో కళాకారిణి. తమిళనాడు ప్రభుత్వం ఈమెను కళైమామణి బిరుదంతో సత్కరించింది.
 
కోమల [[మద్రాసు]]లో జన్మించింది. ఈమె తల్లితండ్రులు పార్థసారధి, లక్ష్మి. మూడేళ్ళ వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన కోమలకు ఒక తెలిసిన వ్యక్తి రేడియోలో పాడే అవకాశం ఇచ్చింది.<ref>[http://1.bp.blogspot.com/_vDh6VLh0MwE/TDWtWRz8L_I/AAAAAAAABwI/tVwL9-wPVhI/s1600/singer+ap+komala+1.jpeg జ్ఞాపకాలు - ఎపి కోమల]</ref> అదే సమయంలో రేడియోలో నాదస్వరం వాయించటానికి [[రాజమండ్రి]] నుండి మద్రాసు వచ్చిన గాడవల్లి పైడిస్వామి ఆమె పాటను విని, ఆనందపడి, కోమలిని తనతో పాటు రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చాడు. జన్మతః తమిళురాలైనా కోమల సంగీతం నేర్చుకున్నది తెలుగుదేశంలోనే.<ref>[http://www3.starscolorbp.blogspot.com/images_vDh6VLh0MwE/TDa9YWcRDiI/AAAAAAAABxI/p_t969LUlQM/s1600/singer+ap+komala-a.p.-01.jpgjpeg కమ్మని కోమల గాత్రధారిణి]</ref> ఈమె సినిమాలలో పాటిన తొలిపాట, చివరి పాట తెలుగు పాటలే కావటం విశేషం. ఈమె 1949లో రక్షరేఖతో సినీ గాయనిగా పరిచయమైంది.
 
సంగీత అవగాహన ఉండటం వళ్ళ 1944లో తొమ్మిదేళ్ళ వయసులోనే ఈమెకు ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. రేడియో ప్రసారమయ్యే గానలహరి కార్యక్రమంలో విద్యార్ధినిగా పాల్గొనేది. అక్కడ పనిచేస్తుండగా సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది.
 
ఆలిండియా రేడియోలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కోమల 1995లో పదవీ విరమణ పొందింది.
"https://te.wikipedia.org/wiki/ఎ.పి._కోమల" నుండి వెలికితీశారు