రావు వేంకట మహీపతి గంగాధర రామారావు I: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
గంగాధర రామారావు వైష్ణవమతాభిమాని. ఆయనకు శ్రీవైష్ణవ పీఠస్థులైన వానమామలై జియ్యంగారు గురుత్వం వహించేవారు. స్మార్తులకు శంకరాచార్య పీఠములెటువంటివో విశిష్టాద్వైతులకు ఈ పీఠమూ అటువంటిది. ఆ పీఠానికి అన్నివిధాలా రామారావు అండగా ఉండేవారు.
== దానధర్మాలు ==
మహా పండితుడైన పాపయ్య శాస్త్రికి మొదట 96 ఎకరాల లంక భూమిని యిచ్చి, ఆపైన వారొక చమత్కారం చేయగా దానిని 148 ఎకరాలు చేసి స్థిరపరిచారు. ఆయన పండితులతో మాట్లాడేప్పుడు ధారాళంగా సంస్కృతంలోనే మాట్లాడేవారు. ఆయనకు దివానులు, ఉన్నతోద్యోగులు, పండితులు, ఆంతరంగికులు మొదలైనవారిపై కోపతాపాలు కలిగితే దానిని వ్యక్తపరిచే తీరు చాలా విచిత్రంగా ఉండేది. తీవ్రమైన కోపానికి కారకులైనవారి జుట్టును పూర్తిగా గొరిగించేవారు. ఆనాటి సాంఘిక స్థితిగతుల రీత్యా పూర్తిగా జుత్తు తీసివేసి, బోడిగా తిరగడమంటే గొప్ప అవమానకారకం. ఐతే ఆయన ఇలా అవమానించిన వెంటనే, దీన్ని పూరిస్తూ వారికి బాగా ధనం సకల గౌరవలాంఛనాలతో సహా చెల్లించి మర్యాద చేసేవారు. ఇలాంటి అవమాన సన్మానాలు పొందినవారిలో అప్పటి పండితులైన పొక్కునూరి వెంకటశాస్త్రి వంటి వారు కూడా ఉన్నారు. ఇందులో ధనగౌరవాలు కూడా ఇమిడి వుండడంతో ఆయన ''మహాప్రభో, నా జుట్టు యెంతో అదృష్టం పెట్టిపుట్టింది కనుక మీవంటి మహాప్రభువుల కత్తికి ఎరయ్యింది'' అనేవారు. పైగా ఈ విషయం తెలిసిన అనేకులు సంస్థానాధీశునికి కోపం తెప్పించి అవమానపడి లాభం పొందుదామని ప్రయత్నాలు చేసేవారు. ఇటువంటి నకిలీ ప్రయత్నాలను రామారావు సూక్ష్మబుద్ధితో తెలుసుకుని వాటి వలలో పడక కోపించేవారు కాదు.