శృంగేరి శారదా పీఠం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
== చరిత్ర ==
శృంగేరీ పీఠాధిపతియైన విద్యారణ్యస్వామి భారతదేశ చరిత్రలో ముఖ్యమైన [[విజయనగర సామ్రాజ్యము]] స్థాపింపజేసి [[హరిహర రాయలు]], [[బుక్కరాయలు|బుక్కరాయలకు]] మార్గదర్శనం చేశారు. విద్యారణ్యుని గౌరవార్థం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాజధాని నగరానికి విద్యానగరం అని పేరు పెట్టారు. క్రమంగా ఈ నగరానికి విజయనగరమనే పేరు కూడా వచ్చింది. సామ్రాట్టులకు కూడా విజయనగర సామ్రాజ్య చక్రవర్తులనే పేరుతో పాటుగా విద్యానగర చక్రవర్తులనే పేరు కూడా వ్యాప్తిలో వుంది. క్రీ.శ.1336 రాగి ఫలకం అధారంగా "విద్యారణ్యుడి ఆధ్వర్యములో హరిహర రాయలు సింహాసనం అధిష్టించాడు" అని తెలుస్తోంది. విద్యారణ్యుడు హరిహరునికి ఆత్మ విద్య బోధించి "శ్రీమద్రాజాధిరాజ పరమేశ్వర అపరిమిత ప్రతాపవీర నరపతి" అనే బిరుదాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శృంగేరీ శారదా పీఠం పీఠాధిపతి బిరుదులలో "కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య" కూడా చేర్చి చెబుతారు.
 
==శాఖలు==
"https://te.wikipedia.org/wiki/శృంగేరి_శారదా_పీఠం" నుండి వెలికితీశారు